Big Stories

Pournima : పూర్ణమి వేళ రాశులపై ప్రభావం

Pournima : నవంబర్ 8న చంద్ర గ్రహణం రోజున బ్లడ్ మూన్ ఏర్పడుతోంది. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం అశ్వినీ మాసంలో వచ్చే పూర్ణిమను శరద్ పూర్ణిమ లేదా కామున్ని పున్నమి లేదా కోజాగిరి పూర్ణిమ అంటారు. . పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున చంద్రుని దగ్గర నుంచి అమృత వర్షం కురుస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఇదే రోజున లక్ష్మీదేవి సాగర మథనం నుంచి ఉద్భవించిందని, అందుకే ఈ పూర్ణిమ నాడు మహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే శ్రీ మహా విష్ణువును కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం తప్పక లభిస్తుందని చాలా మంది విశ్వాసం.

- Advertisement -

మేష రాశి
చంద్రుడిప్రభావం మేష రాశిపై పడుతుంది. ఈ రాశి వారి పిల్లలపై దీని ఎఫెక్ట్​ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఆందోళన చెందకుండా పిల్లలపై, చదువులపై శ్రద్ధ పెట్టాలి. తరచూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, డ్రైవింగ్​ చేసే సమయంలో.. రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడు ఆరోగ్యప్రదాత..

- Advertisement -

తుల రాశి
చంద్రుడి గ్రహణం వల్ల ఈ రాశి వారికి ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన చోట్ల అధికంగా ధనం వృథా అవుతుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. ఈ సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఏ పనిలోనైనా జాగ్రత్త అవసరం. గణపతిని పూజించండి, మీ రాశిపై ఉన్న దృష్టి పోతుంది.

కుంభ రాశి
ఈ రాశి వారు గ్రహణం వల్ల తరచూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, డ్రైవింగ్​ చేసే సమయంలో.. రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడు ఆరోగ్యప్రదాత కావునా 11 మంగళవారాలు ఆంజనేయుడి గుడికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News