Big Stories

Saturday Remedies : శనివారం నాడు ఇనుము కొనకూడదు ఎందుకంటే…

Saturday Remedies : భారతీయుల జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడు ,నవగ్రహాలలో ఒకటి. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగన మండలంలో ఉన్నగ్రహాలకు భూమి. వారంలో ఏడవవారం శనివారం. శనివారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యలలో ‘ఎనిమిది’ శనికి ప్రీతికర సంఖ్య. సకల జీవులకు ప్రత్యక్ష దైవం అయినట్టి సూర్యుభగవానుడికి ఛాయదేవికి పుట్టిన సంతానం శనిదేవుడు. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. శనీశ్వరునికి ఇష్టమైనవి నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము,అశుభ్రంగా ఉండే చోటు, బద్దకంగా ఉండే వారు.

- Advertisement -

శనీశ్వరునికి నడకంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రదక్షణలు చేస్తారు. శనిని తమకు అనుకూలంగా దీవించమని ప్రార్ధిస్తుంటారు. మనస్సుకి, ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి సమస్త కార్యాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. నడక శరీరంలో శక్తి పెంచుతుంది.

- Advertisement -

నమ్మక ద్రోహం,వెన్నుపోటు,హింస,పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి వారి కర్మ ఫలిత ఆధారంగా శనిదేవుడు వారిని ఎక్కువ ఇబ్బంది పెడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.శని దేవుడి దృష్టి పడ్డవారిని హింసించి, నానా కష్టాల పాలుచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.

నవగ్రహాలకు వెళ్లి శనీశ్వరుని దర్శించుకోవాలి. అలా వెళ్లేటప్పుడు నల్లటి నువ్వులను తీసుకొని, నవగ్రహాలలోని శని పాదాల ముందర వాటిని సమర్పించాలి, అలాగే నువ్వుల నూనెతో శనీశ్వరునికి తలనుండి పాదాల వరకూ వచ్చేలా నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. శనివారం రోజు ఎరుపు రంగు మిరియాలకు బదులుగా నలుపు రంగు మిరియాలను వాడాలి.శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వుల నూనెను, నువ్వులను, ఇనుప వస్తువులను ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదు. అలా చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News