Tilak-Dube : ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్తాన్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 146 పరుగులు చేసింది. 147 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా త్వరత్వరగా ఓపెనర్ అభిషేక్ శర్మ 5 , సూర్యకుమార్ 1, శుబ్ మన్ గిల్ 12 త్వరగా ఔట్ అయ్యారు. అయితే వీరు ఔట్ కాగానే తిలక్ వర్మ వచ్చి చివరి వరకు పోరాడాడు. తిలక్ వర్మకు సంజూ శాంసన్, శివమ్ దూబే కూడా వికెట్ పడకుండా సహకరించారు. అయితే వీరిద్దరిలో శివమ్ దూబే కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కొన్ని కీలక సమయాల్లో సిక్సర్ తో స్కోర్ బోర్డు పరుగెత్తాలా చేశాడు.
Also Read : Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీషన్లు
కానీ తిలక్ వర్మ నాటౌట్ గా నిలవడంతో అతనికి సహకరించిన శివమ్ దూబే కి గుర్తింపు లేకుండా పోయింది. ఇదే సీన్ 2011 వన్డే వరల్డ్ కప్ లో గౌతమ్ గంభీర్ కి కూడా జరిగింది. గౌతమ్ గంభీర్ వికెట్ పడకుండా విరాట్ కోహ్లీతో కలిసి చాలా సేపు క్రీజులో ఉన్నాడు. 97 పరుగులు చేశాడు. కానీ ఎం.ఎస్. ధోనీ సెంచరీ చేయడంతో అతనికి గుర్తింపు లభించింది. వికెట్లు పడకుండా అడ్డుకున్న గంభీర్ కి మాత్రం గుర్తింపే లేదు. తాజాగా తిలక్ వర్మ రాత్రికి రాత్రే స్టార్ క్రికెటర్ అయ్యాడు. శివమ్ దూబే మాత్రం అంత ఫేమస్ కాలేకపోయాడు. అసలు అతను చేసిన పొరపాటు ఏంటి..? అని నెటిజన్లు ప్రశ్నించడం గమనార్హం. 2011 సమయంలో.. గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు శివం దూబేకి జరిగిందని స్పష్టంగా అర్థం అవుతోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ లీగ్ దశలో, సూపర్ 4 దశలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఫైనల్ లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరచడం విశేషం.
ఇక కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ పేలవ ప్రదర్శన చేసినప్పటికీ అతన్ని కెప్టెన్ గా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి గతంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా కొనసాగించి.. మధ్యలో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారు. అసలు టీమిండియా ఎప్పుడూ ఎవ్వరినీ ఏవిధంగా ఉపయోగించుకుంటుందో అర్థం కానీ పరిస్థితి. కీలక బౌలర్ సిరాజ్, కీలక బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ని టీ-20 ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలే ఉన్నాయి. ఆసియా కప్ 2025 ట్రోఫీ గెలుచుకున్నప్పటికీ టీమిండియా ఆ ట్రోఫీని తీసుకోకపోవడం చాలా బాధాకరమనే చెప్పాలి. వాస్తవానికి మోహ్సిన్ నఖ్వీ కూడా అంతటి పంతానికి పోకుండా ఉండాల్సింది. టీమిండియా ఆటగాళ్లు తాము తీసుకోము అని ముందే చెప్పినప్పటికీ.. యూఏఈ మంత్రితోనో.. మరెవ్వరితోనే అందజేస్తే బాగుండేది. కానీ పంతానికి పోతే పాకిస్తాన్ కే నష్టం అనే విషయం నఖ్వీ గ్రహించనట్టు తెలుస్తోంది.
?igsh=cDNoODJuN3JrZGdo