Big Stories

Early Morning : తెల్లవారుజామున బయలుదేరితే వారశూల దోషముండదా..?

Early Morning : తెల్లవారజామున అంటే ఉదయం నాలుగు గంటల ముందు అనగా సూర్యోదయం ముందు బయలుదేరితే దోషము ఉండదు. ఏ దిక్కుకైనా ప్రయాణించ వచ్చు. వారశూల దోషాలతో సంబంధం ఉండదు. అయితే ఈ విషయం కేవలం ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది. ఏదైనా ప్రత్యేక కార్యార్థం కొన్ని దిక్కులకు ప్రయాణించడానికి కొన్ని వారాలను నిషేధించడాన్నే వారశూలం అంటారు. వారశూల చూసుకోకుండా ప్రయాణిస్తే అనేక ఇబ్బందులు కలిగి, కార్యసిద్ది జరగదు. భోజనానంతరం ప్రయాణిస్తే వారశూల దోషముండదు. వారశూలం నిత్యప్రయాణాలకు వర్తించదు.

- Advertisement -

సోమ శనివారములు తూర్పు ప్రయాణం నిషిద్ధం.గురువారం దక్షిణం ప్రయాణం నిషిద్ధం. ఆది, శుక్ర వారములు పడమర దిశా ప్రయాణం నిషేధం. బుధ, మంగళ వారములు ఉత్తర దిశా ప్రయాణం నిషేధం. దీనికే వారశూల అని పేరు. ఆయా వారాల్లో ఆ దిక్కులకు ప్రయాణం నిషేధం కావున వారశూల అంటారు. అయితే ఒకవేళ అత్యవసరంగా వారశూల వున్న దిశకు ప్రయాణం చేయాలి ఎలా? రాత్రి కాలము వార దోషములు ఉండవని శాస్త్రం చెబుతోంది.. దానికి బలమైన కారణం ఉంది. ఆగ్నేయ దిక్కుకు సోమ గురువారములు, నైరుతి దిశకు ఆది శుక్ర వారములు, ఈశాన్య దిక్కుకు బుధవారం, వాయవ్య దిశకు మంగళవారం వారశూల ప్రయాణం కూడదు.

- Advertisement -

మన ఇంట ప్రారంభం అయిన తరువాత తొమ్మిదవ రోజు తిరుగు ప్రయాణం చేయరాదు. అలాగే తొమ్మిదవ రోజు ఇంటిలోకి ప్రవేశించకూడదు. అలాగే నవమి తిథి రోజున ప్రయాణం చేయరాదని శాస్త్ర వచనం. విశేష కార్యక్రమములు, వధువు ప్రయాణం, చిన్నపిల్లల ప్రయాణం, గర్భిణీ ప్రయాణం విషయాలమీద మంచి ముహుర్తం చూసుకుని ప్రయాణం చేయాలి. . ఉద్యోగ విషయంగా తిరిగే వారికి పట్టింపులేదు. ఒకవేళ ఉద్యోగరీత్యా తిరిగే వారికి వారశూల నియమం పాటిస్తే విశేష కార్యలాభం వుంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News