E-Paper
Advertisement

SpaceX launches : ఇక అంతరిక్షంలో టమాటాల సాగు. 3,500 కిలోల సామాగ్రితో అంతరిక్ష కేంద్రానికి రాకెట్

SpaceX launches : ఇక అంతరిక్షంలో టమాటాల సాగు. 3,500 కిలోల సామాగ్రితో అంతరిక్ష కేంద్రానికి రాకెట్
Advertisement

SpaceX launches : అంతరిక్ష పరిశోధనా కేంద్రాల్లో ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి సైంటిస్టులు కొత్త కొత్త ప్రయోగాలు చేపడుతున్నారు. అయితే వారికి ఆహార సమస్య వస్తోంది. వీరి కోసం టమాటల నుంచి అక్కడ అవసరమై నిర్మాణ సామాగ్రి వరకు నాసా పంపిస్తోంది. ఏకంగా 3,500 కిలోల సామాగ్రిని స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వీటిని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం-ఐఎస్ఎస్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 23న ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అర్ధరాత్రి రాత్రి దాటాక 2:24 గంటలకు ఈ రాకెట్ ని పంపిస్తారు. అంతరిక్షంలో మనుషులు నివసించడానికి అవసరమైన పరిశోధనలను అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కొనసాగిస్తున్నారు సైంటిస్టులు.
స్పేస్ స్టేషన్ లో ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలకు ఆహార కొరత పెద్ద సమస్యగా మారింది. అందుకే అక్కడే ఆకుకూరలు, కూరగాయలు పండించే పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తాజా ఆకుకూరలను పండించడంలో ఇప్పటికే సైంటిస్టులు సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు టమాటాలు పండించడంపై ఫోకస్ పెట్టారు. వెజ్ 0.5 పేరుతో టామాటాల సాగుకు శ్రీకారం చుడుతున్నారు. పొట్టి మొక్కలు చిన్న టమాటాలను ఉత్పత్తి చేసేలా సాగు కొనసాగనుంది. టమాటాల సాగుపై ప్రయోగాలు చేపట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఒకటి టమాటాలను వండకుండానే తినే వీలుంది. రెండు ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. మూడు.. వీటిలో పోషకాలు ఎక్కువ. అందుకే శాస్త్రవేత్తలు వీటిని సాగుచేసి తమ ఆహార కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అంతరిక్షంలో మనిషి నివాసానికి అనువైన గ్రహాల కోసం వెదుకుతున్న మనిషికి అక్కడ ఆహారం అవసరం. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే అంతరిక్షంలో కూరగాయల సాగు కూడా సులువవుతుందనేది ఈ ప్రయోగం ఉద్దేశం.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×