Big Stories

Sunday:-ఆదివారానికి ఎరుపు రంగుకి ప్రత్యేకమైన రోజా….?

Sunday:-ఆదివారం సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. సంస్కృతంలో భానువారంగా పేరుంది. మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆదివారాన్ని సూర్యదేవుని పేరుతో రవివార్ గా పిలుస్తున్నారు. కొన్ని దేశ సంస్కృతులలో ఇది వారాంతంలో రెండో రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు.

- Advertisement -

ఆదివారం రోజు ఉదయాన్నే సూర్య స్త్రోత్రం పఠించడంతోపాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిది. సూర్య స్తోత్రం తర్వాత ఆలయ దర్శనం చేసుకుని ఎరుపు రంగు పుష్పాలను సమర్పించడం మంచిదని పండితులు సెలవిస్తున్నారు. ఆదివారం రోజు స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు రంగు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని చెబుతున్నారు.

- Advertisement -

ఆదివారం ఎరుపు రంగు దుస్తుల‌ను ధరించడం శ్రేష్టమని నిపుణులు అంటున్నారు. భానువారం రోజున‌ సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరి చేరుతాయి. గోధుమలతో తయారు చేసిన‌ వంటకాలు.. చపాతీ, పూరీ త‌దిత‌రాలను ఆదివారం రోజు భుజించినట్లైతే ఆరోగ్యదాయకమని చెబుతున్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం

ఆదివారం నాడు ఇనుము కొనుకూడదు. హార్డ్ వేర్ వస్తువులను కొనకూడదు . అలా చేయకపోవడం ల్ల డబ్బుకు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. అందుకే హార్డ్వేర్ కు సంబంధించిన వస్తువులు ఈ రోజు అస్సలు కొనకండి.ఎరుపురంగు వస్తువులు, పర్సులు, గోధుమలు, కత్తెరలు మొదలైనవాటిని కొనుగోలు చేస్తే మంచిది. ఆదివారం ఈ వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు…….

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News