OG Success Meet : కొన్ని సినిమాలకు ఊహించిన కమర్షియల్ సక్సెస్ రాదు. కానీ ఆ సినిమాలకు కల్ట్ స్టేటస్ ఉంటుంది. అలాంటి సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయాయి. కానీ ఆ సినిమాలకు కల్ట్ స్టేటస్ ఉంటుంది.
అలానే పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన జానీ సినిమాకి కూడా అలాంటి కల్ట్ స్టేటస్ ఉంది. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమా ప్రస్తావని తీసుకొస్తే ఈ సినిమా డైరెక్షన్ ఉంటుంది అని టెక్నికల్ గా మాట్లాడుతారు. స్టోరీ పరంగా సినిమా ఆకట్టుకోకపోయినా, పవన్ కళ్యాణ్ డైరెక్షన్ స్కిల్స్ అయితే మాత్రం విపరీతంగా ఈ సినిమాతో బయటపడ్డాయి.
జానీ సినిమాను చాలా మంది ఇష్టపడుతుంటారు. వాళ్లలో సుజీత్ కూడా ఒకడు. గతంలో సుజిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జానీ సినిమాకి హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లాను. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. నేను హెడ్ బ్యాండేజ్ కట్టుకొని కొన్ని రోజుల వరకు అదే వేసుకుని తిరిగేవాన్ని. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఏడిపించే వాళ్ళు అంటూ చెప్పాడు.
సుజిత్ జానీ సినిమా ప్రస్తావని తీసుకొస్తాడు అని చాలామంది జానీ సినిమా ఫ్యాన్స్ కూడా ఎదురు చూశారు. కానీ సినిమా కన్సర్ట్ లో ఆ ప్రస్తావని తీసుకురాలేదు. ఇప్పుడు సక్సెస్ మీట్ లో జానీ సినిమా గురించి మాట్లాడాడు సుజీత్. జానీ లాంటి సినిమా లేకపోతే నాలాంటి డైరెక్టర్ అనేవాడు ఇండస్ట్రీకి వచ్చి ఉండడు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జానీ సినిమా వాల్ పేపర్స్ పెట్టుకొని వాడు ఒకడున్నాడు అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పరిచయం చేశాడు సుజిత్.
జానీ సినిమా స్టిల్స్ తోనే నేను ఇది మొదలు పెట్టాను. నేను రాస్తున్నప్పుడు కూడా జానీ సినిమా నా దృష్టిలో ఉంది. ఈ విషయం నేనెప్పుడూ కళ్యాణ్ గారికి చెప్పలేదు. అంతలా ఇన్స్పైర్ చేసిన సినిమా జానీ. అంటూ సుజిత్ జానీ సినిమా పైన తనకున్న అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తిపరిచాడు.
కేవలం సుజీత్ మాత్రమే కాకుండా సంచలన దర్శకుడు బండి సరోజ్ కుమార్ కూడా గతంలో మాట్లాడుతూ జానీ, ఒక్కడు సినిమాలో నన్ను డైరెక్షన్ పరంగా బాగా ఇన్స్పైర్ చేశాయి అంటూ అప్పట్లో మాట్లాడారు.
Also Read: OG Success Event : షాకింగ్ న్యూస్, ఓజీ యూనివర్స్ కు పవన్ కళ్యాణ్ నో? ఆ సైగ కి అర్థం ఏంటి?