BigTV English

Flight: తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. మద్యం మత్తులో..

Flight: తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. మద్యం మత్తులో..

Flight: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తాగినమైకంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన విషయం తెలిసిందే. గతేడాది నంబర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన మరువక ముందు ఇదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. మళ్లీ న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు పక్కన కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.


శుక్రవారం రాత్రి న్యూయార్క్ నుంచి AA292 అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. ఆ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మైకంలో మూత్రవిసర్జన చేశాడు. అయితే అది తోటి ప్రయాణికుడిపై పడడంతో అతను సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వెంటనే సిబ్బంది పైలట్ ద్వారా ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి తెలియజేశారు.

విమానం 14 గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే నిందితుడ్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరుపక్షాల వాదనలు నమోదు చేసి విచారిస్తున్నారు.


Tags

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×