Big Stories

Online Laddu: ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూలు అంతా మోసమే

Online Laddu:తిరుపతి ప్రసాదం లడ్డూ అంటే భక్తులకి ఎంతో ఇష్టం. ఎవరైనా తిరుపతి వెళ్తే లడ్డూ ప్రసాదం ఇచ్చారా అని అడిగి మరి తింటారు. ఆ స్వామి ప్రసాదం స్వీకరిస్తే మంచి జరుగుతుందన్న నమ్మకం. అలాంటి లడ్డూల విషయంలో భక్తులకు ఉన్న నమ్మకాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. టెక్నాలిజీని ఆసరా చేసుకుని భక్తుల్ని మోసం చేస్తున్నారు.టీటీడీ వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకానీ దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టీటీడీ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ విషయాన్ని భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధికారులు చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

- Advertisement -

ప్రస్తుతం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ ఆలయ నిబంధనల ప్రకారం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి రాజీ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ కి తగ్గట్టు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ ప్రసాద కేంద్రాలను పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న లడ్డూ విక్రయ కేంద్రాలు పెరుగుతున్న భక్తుల సంఖ్యతో సరిపోవటం లేదు. చాలా సేపు లడ్డూ కోసం వేచి చూడాల్సి వస్తోంది. దీంతో, భక్తుల నుంచి వస్తున్న వినతుల మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 50 లడ్డూ కేంద్రాలు నిరంతరం ప్రసాదాలు అందిస్తున్నాయి. అయినా..ఇవి సరిపోవటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకొని మరిన్ని లడ్డూ కేంద్రాలు పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.

- Advertisement -

ప్రస్తుతం తిరుమలలో 24 గంటలు లడ్డూ విక్రయ కేంద్రాలు పనిచేసేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. గతంలో పరిమిత సమయంలో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. భక్తుల సూచనల మేరకు ఇప్పుడు నిరంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News