Big Stories

AP: బుగ్గనతో బిగ్ స్టేట్ మెంట్!.. ఏపీ కేపిటల్ పై మైండ్ గేమ్?

AP: ఏపీ రాజధాని ఏది? ఇదో బేతాళ ప్రశ్న. కేంద్రం సైతం సమాధానం చెప్పలేని చిక్కుప్రశ్న. చిక్కుపడిన రాజధాని ముళ్లను విప్పాల్సింది పోయి.. మరింత చిక్కుచిక్కుగా ముడేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అందుకే, ఏపీ కేపిటల్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. కన్ఫ్యూజన్ తో కూడిన కాంట్రవర్సీ క్రియేట్ అవుతోంది. తాజా, బుగ్గన వ్యవహారం ఇదే కోవలో జరిగిందా? లేదంటే, అంతా పక్కా ప్లాన్డ్ గానే రచ్చ నడుస్తుందా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసెంబ్లీలో ఈమధ్య మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది ఈయనే. ఆ సందర్భంగా పాలనా వికేంద్రీకరణ గురించి సుదీర్ఘంగా చేసిన ప్రసంగం ఇప్పటికీ చాలామందికి గుర్తే ఉంటుంది. బిల్లు వెనక్కి తీసుకున్నా.. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని.. త్వరలోనే మరో బిల్లుతో ముందుకొస్తామని ఆనాడే స్పష్టం చేశారు బుగ్గన. ఏపీ రాజధానిపై సీఎం జగన్ తర్వాత అత్యంత క్లారిటీ ఉన్న నాయకుడు ఆయనే.

- Advertisement -

అలాంటిది.. ఆర్థిక మంత్రి బుగ్గన అంత ఈజీగా అలా ఎలా అనేశారనే ఆశ్చర్యం కలగక మానదు. పక్కా రాష్ట్రానికి వెళ్లి మరీ.. ఏపీకి ఏకైక రాజధాని విశాఖ అని ప్రకటించడం అమాయకత్వమా? వ్యూహాత్మకమా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి పాలనా?.. విశాఖ మాత్రమే రాజధానా? తేడా తెలీనంత చిన్నస్థాయి నేత అయితే కాదు. విశాఖనే కేపిటల్ అని.. అమరావతితో జస్ట్ ఓ సెషన్ పెడతామని.. కర్నూలులో ప్రిన్సిపల్ కోర్టు అంటూ ఇంత క్లారిటీగా, విడమరిచి చెప్పడం చూస్తుంటే ముందస్తు ప్రిపరేషన్ తోనే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

విశాఖకే టోటల్ కేపిటల్ షిఫ్ట్ చేయాలని వైసీపీ పెద్దలు బలంగా కోరుకుంటున్నారు. కానీ, మిగతా ప్రాంతాల మనోభావాలు దెబ్బతింటాయని.. మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారంటారు. అమరావతిని ఆగం చేయడమే జగన్ ప్రధాన లక్ష్యమని చెబుతుంటారు. అందుకే, పదే పదే విశాఖ నుంచే పాలన అంటూ ప్రజలను మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ఒకవేళ మూడు రాజధానులు కాకుండా.. విశాఖనే ఏకైక రాజధాని చేస్తే ఎలా ఉంటుంది? ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? టెస్ట్ చేయడానికే.. ఇలా కావాలనే బుగ్గనతో బిగ్ స్టేట్ మెంట్ ఇప్పించారని కూడా అనుమానిస్తున్నారు. అయితే, ఆ డైలాగ్ బాగా బెడిసి కొట్టడంతో.. విశాఖనే ఏకైక రాజధాని ప్రతిపాదన వర్కవుట్ అయ్యేలా లేదని గ్రహించి.. వెంటనే సలహాదారు సజ్జల రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు స్టార్ట్ చేశారని అంటున్నారు. బుగ్గనతోనూ వివరణ ఇప్పించి.. ఏపీకి మూడు రాజధానులేనంటూ మళ్లీ గట్టిగా చెప్పించారు. ఇదంతా మైండ్ గేమ్ అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News