Big Stories

Holi colors:-హోలీ రంగుల వెనుక రహస్యమిదే…

Holi colors:-హోలీ యుగయుగాలుగా జరుగుతున్న పండుగ. ఇందుకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో అన్నింటి కన్నా ఆసక్తిగా అనిపించేది రాథాకృష్ణులది. కన్నయ్య నీలి మేఘ శ్యాముడు. తన నెచ్చెలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తాను నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర చెప్పాడట. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు, హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండని సలహా ఇచ్చిందట. అంతే రాధతో పాటూ గోపికలందర్నీ రంగు నీళ్లలో ముంచెత్తాడు. ప్రతిగా రాధ కూడా కృష్ణుడిమీద వసంతం కుమ్మరిస్తుంది.

- Advertisement -

హోలీ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం గోపికలతో చేరి రంగులు, పూలతో పండుగను జరుపుకున్నట్టుగా పురాణాల్లో ఉంది. ఈ రోజు పువ్వులు, రంగులను ఒకరిపై ఒకరు జల్లుకోవడం వల్ల సౌభాగ్యాలు, అనుబంధాలు, ప్రేమలు వెల్లివిరుస్తాయని విశ్వాసం

- Advertisement -

అప్పటినుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, సన్నిహితులు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమైందని చెబుతారు. ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోళీని ఘనంగా జరుపుకుంటారు. హోలీ రోజు రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తరభారతదేశంలో ఉంది.

హోలీ తరువాత వచ్చే పంచమినాటి వరకూ కూడా ఈ సంబరాలు సాగుతాయి. హోలీని డోలోత్సవం అనికూడా అంటారు. పశ్చిమ బెంగాల్ ల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో పెట్టి ఊరంగా ఘనంగా ఊరేగిస్తారు. డోలిక అంటే కూడా ఊయల అనే అర్థం. అక్కడ ఈ పండుగను డోలికోత్సవం అంటారు. మణిపూర్లో హోళీ అంటే కృష్ణుని పండుగే. అందుకనే ఈ అయిదు రోజులూ ఊళ్లన్నీ కృష్ణభజనలతో మారుమోగి పోతుంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News