BigTV English

Tholi Tirupati:- తూర్పుగోదావరిలో తిరుపతి

Tholi Tirupati:- తూర్పుగోదావరిలో తిరుపతి
Tholi Tirupati

Tholi Tirupati:- తిరుపతి అంటే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి. అయితే తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దివిలిలో కొలువైన శృంగార వల్లభుని సన్నిధే తొలి తిరుపతి అని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఈ ప్రాంతాన్ని చెదలవాడ క్షేత్రంగా కూడా చెబుతారు. ఈ స్వామి పురాతనత్వం ధృవ నక్షత్రమంత పాతది. ఇంకా చెప్పుకుంటే, ఆ నక్షత్రంతో ముడిపడినది.


సింహాచలంలో శ్రీహరి 8000 సంవత్సరాల క్రితం వెలిశారు. తిరుమల తిరుపతిలో వెంకన్నగా 6000 సంవత్సరాల క్రితం కొలువయ్యారు . ఈ విధంగా దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలతో పోల్చి చూస్తే, అత్యంత పురాతనమైన , పరమ పవిత్రమైన క్షేత్రం పెద్ద పురంలోని శృంగారవల్లభుని సన్నిధి . అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారట. ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని – నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అక్కడ ఉన్న శాసనాలు ఈవిషయాలను విశదీకరిస్తున్నాయి.

వేంకటేశ్వరుడు కష్టాలని కడతేర్చే ఆపదమొక్కులవాడు . తిరుపతి వెంకన్నని శరణంటే , కష్టాలు కనిపించనంత దూరం పారిపోతాయని , పాపాలన్నీ తొలగిపోతాయని , లక్ష్మీ కటాక్షం కనికరిస్తుందని అశేషమైన భక్తుల నమ్మకం . అయితే, వెంకన్న కొలువైన తొలి తిరుపతి మాత్రం తిరుమల కాదని చెదలవాడ క్షేత్ర స్థల పురాణం వివరిస్తోంది.


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×