Jeevan Reddy : ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితోపాటు అతని అనుచరుడు అనిల్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెండు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఆలయాలకు ధూపదీప నేపధ్యాలు లేకుండా చేశారని అంటున్నారు. ఎమ్మెల్యే ఆ ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు.స్నేహం ముసుగులో తనను నిలువునా ముంచేశారని ఫిర్యాదుదారు దామోదర్ రెడ్డి చెబుతున్నారు. న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నారు.
హైదరాబాద్ శివారులోని సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఆలయాలను మూతేశారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ లో రైతు సంఘం నేతగా ఉన్నారు. ఆయనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.