OG Success Event : పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఓ జి. ఈ సినిమా విపరీతమైన అంచనాలతో విడుదలై వాటిని సక్సెస్ఫుల్గా నిలబెట్టుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి యూనివర్స్ కూడా క్రియేట్ చేస్తున్నట్లు సుజిత్ అనౌన్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా ఫ్యామిలీ తో పాటు స్పెషల్ షో చూసిన వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడితో పవన్ కళ్యాణ్ మళ్లీ ఓ జి 2 సినిమా చేస్తున్నాడు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ప్రస్తుతం జరుగుతుంది. సుజిత్ స్పీచ్ లో భాగంగా ఓజి యూనివర్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ నో అన్నట్లు చేయి ఊపారు. తరువాత ఏదో చెప్పబోయారు. వెంటనే సుజిత్ ఆ టాపిక్ మార్చేశాడు.
సుజిత్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎమోషన్. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను లేదు అనేది పక్కన పెడితే. లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో అని చెప్పినట్లు తమ్ముడు సినిమా పోస్టర్ తో నా ప్రేమ మొదలైంది. నేను పవన్ కళ్యాణ్ కి కథ రాయాలి, ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, ఇలాంటి సీన్స్ ఉండాలి అని నేను లైఫ్ లో ఎప్పుడూ అనుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే దానికి కేవలం నాకు ఆయన మీద ఉండే ప్రేమ. నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని అనలేదు. కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే.
నేను అటు వెళ్తున్న కూడా అరే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడున్నాడు అని తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఎలివేషన్స్ అందరూ బాగున్నాయి అంటున్నారు. నేను నిజంగా ఎలివేషన్స్ కోసం కూడా సినిమా రాయలేదు. కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను షూట్ చేశాను అంతే. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిపోయిన రోజుకి నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే కళ్యాణ్ సార్ మీటర్ ఇది, కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు, కళ్యాణ్ సార్ తో ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఈయనతో చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు.
ఈ సినిమా తర్వాత కళ్యాణ్ గారితో ఒక సినిమా చేద్దాం సార్ అని అడగాలి అనిపించేది. నేను బొంబాయి లో అందరితో అడిగించా, సర్ ఇది హిట్ అయితే ఇంకొకటి తీద్దాం సార్ ప్లీజ్ అన్నాను. మొత్తానికి ఆయనే ఈ సినిమా యూనివర్స్ ఆయన నోటి నుంచే అనౌన్స్ చేశారు. అని చెప్పాడు సుజిత్ వెంటనే పవన్ కళ్యాణ్ యూనివర్స్ నా గురించి కాదు అన్నట్లు ఏదో మాట్లాడుతున్నారు. అయితే దాని గురించి పవన్ స్పీచ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెంటనే సుజిత్ టాపిక్ మార్చి ఈ సినిమా చేయడానికి కారణమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.
Also Read : OG Success Event : ప్రియాంక మోహన్ బట్టలపై తమన్ షాకింగ్ కామెంట్స్