BigTV English

Varahi Devi Navaratri Pooja: వారాహి మాతకి నవరాత్రి పూజ ప్రత్యేకత ఇదేనా

Varahi Devi Navaratri Pooja: వారాహి మాతకి నవరాత్రి పూజ ప్రత్యేకత ఇదేనా

Varahi Devi Navaratri Pooja : వారాహి మాతను లలితమ్మ అంగ దేవతగా శ్రీవిద్య లో పూజ చేస్తే కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయాలని శాస్త్రం చెబుతోంది. ప్రధాన దేవతగా వారాహిని పూజిస్తే మాత్రం మూడు కాలాల్లో పూజ చేయవచ్చు. ఉదయం సాయంత్రం కూడా వారాహి నవరాత్రులు జరిపే రోజుల్లో పూజను నిర్వహించవచ్చు. వారాహి మాత ఎన్నో సమస్యలకి దారి చూపిస్తుంది. ఆస్తి తగాదాలు, రుణ బాధలు అనారోగ్య సమస్యలు, భూమి కొనడం, అమ్మడంలో సమస్యలకి వారాహి మాత దారి చూపిస్తుంది.


నవరాత్రి పూజలతో శత్రు బాధలు, గ్రహ బాధలు, క్షుద్ర, చేతబడి పూజల నుంచి విముక్తి కలుగుతుంది. భవిష్యత్ లో ఏమైనా మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని దాటి బయటపడే శక్తి అమ్మవారు భక్తులకి కలిగిస్తుంది. ప్రతి కుటుంబానికి అమ్మవారి రక్ష కలగాలంటే
ఈ ఆషాడ వారాహి నవరాత్రులు జరుపుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.

వారాహి మంత్రోపదేశంతో 9 రాత్రులు ప్రతిరోజు వారాహి యంత్రపూజ చేయాలి.


ఉదయం లలితా సహస్రనామ పారాయణం చేయాలి. సాయంత్రం 6 గంటల తర్వాత వారాహి పూజ చేయాలంటోంది శాస్త్రం.

అమ్మవారికి ఇప్ప నూనె అంటే చాలా ఇష్టం ఇప్ప నూనెతో దీపారాధన ప్రీతికరం. ఇప్ప పువ్వులు దొరికితే పూజలో వాడితే మరీ మంచిది. ప్రతి రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యంలో గుండ్రంగా ఉండే పళ్లు నైవేద్యం పెట్టాలి. లడ్డూలు , పనస పండు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి.

కంద దీపం పెట్టుకోవడం మంచిది. చిలకడ దుంపలు ఉడికించి బెల్లాన్ని కలిపి పెట్టాలి. దానిమ్మ గింజలతో అర్చన.. పుట్టతేనె నైవేద్యం కూడా పెట్టొచ్చు.

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×