Jagan Vs Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ రకరకాల స్కెచ్‌లు వేసిందా? కూటమిని ముక్కులు చేసే పనిలో నిమగ్నమైందా? అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోందా? ఈ నేపథ్యంలో జగన్ మరో అస్త్రాన్ని ఎక్కుపెట్టారా? సీఎం చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు ఎందుకు చేసినట్టు? ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది తర్వాత వైసీపీ రూటు మార్చింది. ప్రజా సమస్యల కంటే చంద్రబాబు సర్కార్‌ని ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దాని ద్వారా లబ్ది పొందాలని ప్లాన్ చేసింది. ఓ వైపు కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు నిత్యం అస్త్రాలు విరుసుతూనే ఉన్నారు.
పవన్ కల్యాణ్‌ని ఆకాశాన్ని ఎత్తడం, అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలచుకుని టీడీపీని కార్నర్ చేయడం మొదలుపెట్టింది. ఈ వ్యవహారం జరుగుతున్న క్రమంలో సీఎం చంద్రబాబు నేరుగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇంటికి వెళ్లారు. అయితే నేతల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయన్నది కాసేపు పక్కన బెడదాం.
ఆల్మట్టి వ్యవహారాన్ని తెచ్చిన జగన్
ఇప్పుడు కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు మాజీ సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థాయిలోవున్న మీరు, ఆ ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
ALSO READ: దసరా రోజు వీఐపీ దర్శనాలు లేవు
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడానికి వేగంగా అడుగులు వేస్తుంటే మీకు చీమకుట్టినట్టైనా లేదా? అంటూ మండిపడ్డారు. కేంద్రంలో ఎంపీల సంఖ్యా బలాన్ని ఉపయోగించుకుని ఆల్మట్టి ప్రాజెక్టుఎత్తు పెంపును అడ్డుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూటమి సర్కార్ కు ఓ సలహా ఇచ్చేశారు.
సీఎం చంద్రబాబు ఇప్పటికైనా మేలుకోవాలని, ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు KWDT-2 విచారణపై దృష్టిపెట్టాలన్నారు. దానిపై సమర్థవంతమైన వాదనలు వినిపించాలని లేకుంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ప్రస్తావించారు.
ఎక్స్ వేదికగా రాసిన అంశాల్లో ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు మాజీ సీఎం జగన్. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ విషయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. ఎందుకంటే ఏపీకి ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు.
దీనిపై ఇరుపార్టీలు ఒకేతాటి మీదకు వచ్చిన కేంద్రాన్ని ప్రశ్నిస్తే బాగుండేదని, కేవలం సీఎం చంద్రబాబు టార్గెట్ గా చేసుకుని జగన్ విమర్శలు గుప్పించడం మంచిది కాదని అంటున్నారు ఇరు పార్టీల నేతలు. రానున్న రోజుల్లో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు వ్యవహారంపై ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు ఎలా హ్యాండిల్ చేస్తాయో చూడాలి.
.@ncbn గారూ… మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2025