OTT Movie : కామెడీ జానర్ లో వచ్చిన ఒక మలయాళం సినిమా కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా, ఓటీటీలో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ కథ ఆలుమగల మధ్య వచ్చే అనుమానాలతో మొదలవుతుంది. ఒక్కొక్క పాత్ర ఎంట్రీతో కథ గందరగోళంగా మారుతుంది. ఈ మలయాళం సినిమా, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘తానారా’ 2024లో విడుదలైన మలయాళం కామెడీ సినిమా. దీనికి హరిదాస్ దర్శకత్వం వహించారు. ఇందులో షైన్ టామ్ చాకో, దీప్తి సతి, విష్ణు ఉన్నికృష్ణన్, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఆగస్టు 23న థియేటర్లలో విడుదలై, 2024 డిసెంబర్ 27 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ కేరళలోని ఒక రాజకీయ నేపథ్యంలో ప్రారంభమవుతుంది. అంజలి ఒక మాజీ హోం మినిస్టర్ కూతురు. ఆమె ఆదర్శ్ అనే ఒక ప్రతి పక్ష MLA ను వివాహం చేసుకుంటుంది. ఆదర్శ్ చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అయితే అతని ప్రవర్తనపై అంజలికి సందేహం ఉంటుంది. అతను మరో స్త్రీతో సంబంధం కలిగి ఉండొచ్చని అనుమానిస్తుంది. ఈ అనుమానంతో, ఆమె తన భర్త కదలికలను గమనించడానికి ఎవరినైనా నియమించుకోవాలనుకుంటుంది. ఈ పనిలో ఆమెకు సహాయం చేయడానికి, జేమ్స్ అనే కొంచెం గందరగోళ స్వభావం కలిగిన పోలీసు అధికారి ఎంట్రీ ఇస్తాడు. జేమ్స్ తన సరదా ప్రవర్తనతో కథలో కామెడీని తీసుకొస్తాడు. ఇదే సమయంలో ఒక చిన్న దొంగ, కేవలం తన అవసరాల కోసం కొంత డబ్బు దొంగిలించాలని చూస్తాడు. ఒక రాత్రి అతను ఆదర్శ్, అంజలి నివసించే సిటీకి దూరంగా ఉండే ఒక గెస్ట్ హౌస్ లో చొరబడతాడు. కొంత నగదు తీసుకొని తప్పించుకోవాలనుకుంటాడు. కానీ అతను ఇంట్లో చిక్కుకుంటాడు. జేమ్స్ తన గర్ల్ ఫ్రెండ్ తో గడపడానికి, ఢిల్లీ వెళ్తున్నట్లు అబద్ధం చెప్పి, ఈ గెస్ట్ హౌస్ కి వస్తాడు.
ఇక్కడ నుంచి కథ ఒక కామెడీ రగడగా మారుతుంది. దొంగ ఇంట్లో దాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోతాడు. ఇంతలో అంజలి అక్కడికి రావడంతో కథ మరింత గందరగోళంగా నడుస్తుంది. ఆదర్శ్ తన తన గర్ల్ ఫ్రెండ్ ను, దొంగ భార్యగా అంజలికి పరిచయం చేస్తాడు. అయితే దొంగ అంజలి చేతిలో దొరకడానికి దగ్గరగా వస్తాడు, కానీ అతని చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకుంటాడు. ఈ గందరగోళంలో అంజలి, ఆదర్శ్ మధ్య వివాహ సమస్యలు బయట పడతాయి. అంజలి కూడా జేమ్స్ తో అఫ్ఫైర్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె కూడా ఆదర్శ్ ఢిల్లీ వెళ్లిపోయాడనుకుని, జేమ్స్ తో గడపడానికి వచ్చి ఉంటుంది. ఇక్కడ కథ మరోలా టర్న్ తీసుకుంటుంది. అక్కడికి జేమ్స్ కూడా రావడంతో మరిన్ని కామిడీ ట్విస్టులు వస్తాయి. చివరికి ఈ కథ ఎక్కడివరకు వెళ్తుంది ? వీళ్ళు తమ తప్పులను తెలుసుకుంటారా ? ఇలాగే దొంగాట అడుకుంటారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : చావడానికెళ్లి సీరియల్ కిల్లర్ చేతిలో అడ్డంగా బుక్కయ్యే అమ్మాయి… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్