Illu Illalu Pillalu Today Episode October 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి అవ్వగానే రామరాజు తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం చాలా సంతోషంగా ఈరోజు ఇంట్లోంచి వెళ్లిపోతాడు అని చాలా సంతోషంగా ఉంటుంది. రామరాజు ధీరజ్ పై సీరియస్ గా ఉంటాడు. ధీరజ్ ప్రేమ ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ధీరజ్ ఏమైంది నాన్న అర్జెంటుగా రమ్మని పిలిచారు అని అడుగుతాడు..
ధీరజ్.. రామరాజు నా అకౌంట్లో నుంచి డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావు రా అని అడుగుతాడు. అడుగుతుంటే సమాధానం చెప్పవ్ ఏంట్రా నా ఫోన్ నుంచి లక్ష రూపాయలు దొంగ చాటుగా నీ ఫోన్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు రా అని రామరాజు అడుగుతాడు. లేని ప్రేమలో నటించి డబ్బులు కొట్టేస్తావా అని రామరాజు నిలదీస్తాడు. ప్రేమ చందు కోసమే డబ్బులను తీసుకున్నట్లు బయటపెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు వేదవతి పై సీరియస్ అవుతాడు. కోడల్ని కంట్రోల్లో పెట్టుకుని అత్తగా నువ్వు మిగిలిపోయావు బుజ్జమ్మ అంటూ అరుస్తాడు. కోడళ్లను పెట్టమంటే నువ్వేమైనా పెట్టావా.. అసలు నీ మాటని లెక్క చేసారా అని రామరాజు అడుగుతాడు. ఎంత చెప్పినా సరే నీకు ఈ జన్మకి బుద్ధి రాదు కదా బుజ్జమ్మ అని రామరాజు పేదవతికి క్లాస్ పీకుతాడు. మీరే కదండీ కోడళ్ళని కూతురు లాగా చూసుకోవాలి అని అన్నారు అందుకే బాగా చూసుకుంటున్నాను అని వేదవతి అంటుంది..
దినంతటికీ కారణం వాళ్లే వాళ్లని కడిగి పడేస్తే ఇంకొకసారి ఇలాంటివి జరగవు అని రామరాజు భాగ్యము కి ఫోన్ చేస్తాడు. మీరు మా కొడుకు దగ్గర తీసుకున్న డబ్బు గురించి మాట్లాడాలి రేపు ఉదయం మా ఇంటికి రండి అని రామరాజు అంటాడు. ఆ మాట వినగానే భాగ్యం షాక్ అవుతుంది. ఆనందరావు రేపు మనం వెళ్తే కచ్చితంగా ఏదో ఒకటి అంటాడు మొత్తం కుపీని లాగేస్తాడని టెన్షన్ పడుతూ ఉంటాడు.
ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి అసలు నీకు బుద్ధుందా నువ్వెందుకు ఈ విషయాన్ని బయట పెట్టావు అని అరుస్తాడు. మీ నాన్న నిన్ను అన్ని మాటలు వింటుంటే దొంగ అంటుంటే ఎలా తట్టుకొని ఉండాలి అని ప్రేమ అడుగుతుంది. మా నాన్నే కదా నన్నుంది నీకెందుకు అంత కోపం వచ్చింది అనేసి అడుగుతాడు. ప్రేమ మాత్రం నువ్వు నా మొగుడివి కాబట్టే నాకు అంత కోపం వచ్చింది నువ్వు నా మొగుడివి కాబట్టే నాకు అంత కోపం వచ్చింది.
నిన్ను దొంగ అంటుంటే తట్టుకోలేకపోయాను అందుకే అసలు నిజం బయట పెట్టాను అని ప్రేమ అంటుంది. ఆ మాట అనగానే మౌనంగా ఉండిపోతాడు. ఇక శ్రీవల్లి ప్రేమ తనని అడ్డం నేర్పించిన టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం రామరాజు వీళ్ళని ఉదయం రమ్మని చెప్పాను కానీ ఇంతవరకు రాలేదు చూశావా అని వేదవతితో అంటాడు. రెండు రోజులు వెళ్లకుండా ఉంటే వాళ్లే మర్చిపోతారని అనుకున్నారు.. వల్లి మీ అమ్మానాన్నని అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు అని రామరాజు సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు.
Also Read: గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
నర్మదా ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్లడానికి డ్రెస్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ధీరజ్ మాత్రం ప్రేమను చూస్తూ ఉండిపోతాడు. అక్కడికి వచ్చిన వేదవతి ఏం చేస్తున్నారో గవర్నమెంట్ కోడలు గారు అని అడుగుతుంది. ప్రేమ ధీరజ్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్లడానికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయమని చెప్పింది అందుకే అది చేస్తున్నాను అత్తయ్య అని నర్మదా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..