Nindu Noorella Saavasam Serial Today Episode: హాల్లో పిల్లలు దెయ్యాల ఫ్రోగ్రాం చూస్తుంటారు. ఇంతలో అక్కడికి అమర్, మిస్సమ్మ, రాథోడ్, మనోహరి వస్తారు. ఆత్మల గురించి మాట్లాడుతుంటారు. ఇంతలో అంజు అయితే అమ్మ ఆత్మ కూడా ఉంటుంది కదా డాడ్ అని అడుగుతుంది. ఉంటుందని అమర్ చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మీ అమ్మ ఆత్మ నా ఎదురుగానే నా కళ్ల ముందే ఉంది అని చెప్తాడు అమర్.
దీంతో రాథోడ్ మెల్లగా మిస్సమ్మ నీకు కనిపించినట్టే సారుకు కూడా ఆరుంధతి మేడం ఆత్మ కనిపిస్తుంది అంటావా..? అని అడుగుతాడు. మిస్మస్సమ్మ తెలియదు రాథోడ్ అని చెప్తుంది. డోర్ దగ్గర ఉన్న ఆరుతో గుప్త కోపంగా బాలిక మేము నీకు ఇచ్చిన శక్తులను దుర్వినియోగ పరిచావా..? నీ పతిదేవునికి కూడా నువ్వు కనిపించావు కదూ అని అనుమానంగా అడుగుతాడు. దీంతో ఆరు అయ్యో ఏంటి గుప్త గారు నేను ఆయనకు కనిపించడం ఏంటి..? నేను నా చెల్లికి మాత్రమే కనిపిస్తాను అని చెప్తుంది. ఇంతలో మనోహరి కల్పించుకుని అరుంధతి నీ ఎదురుగా ఉందా..? అని అడుగుతుంది.
దీంతో అమర్ అవును నన్ను విడిచి ఆరు ఎక్కడికి వెళ్లలేదు.. నా కోసం తను ఇక్కడే ఉంది. ఇంటి బయట లాన్‌లో ఆరు ఉన్నట్టు.. నేను బయటకు వెళ్లేటప్పుడు.. నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తను నన్ను చూస్తూ ఉన్నట్టు నా మనసుకు అనిపిస్తుంది. ఆరు నన్ను చూస్తూ నా దగ్గరకు వస్తూ ఉన్నట్టు ఫీల్ అవుతాను. తను నా కళ్లకు కనిపించకపోయినా మనసుకు స్పష్టంగా తెలుస్తుంది అని అమర్ చెప్పగానే.. ఓహో అది నీ ఇల్లూషన్ అన్నమాట. ఇంకా ఆరు భాగీకి కనిపించినట్టు నీకు కనిపిస్తుందేమోనని భయపడి చచ్చాను.. అని మనసులో అనుకుంటుంది. పిల్లుల మీరు పైకి వెళ్లి చదువుకోండి.. ఇంకెప్పుడు ఇలాంటి ఫ్రోగ్రాం చూడకండి అంటూ పిల్లలను పైకి పంపిస్తుంది మనోహరి.
తర్వాత మిస్సమ్మ గార్డెన్‌లోకి వెళ్లి అక్కా అంటూ పిలుస్తుంది. అప్పుడే గుప్తతో మాట్లాడుతూ బయటి నుంచి వస్తున్న ఆరుకు మిస్సమ్మ పిలుపు వినిపిస్తుంది. వెంటనే మిస్సమ్మ అంటూ పిలుస్తూ దగ్గరకు వస్తుంది. మిస్సమ్మ కూడా పరుగెత్తుకుంటూ ఆరు దగ్గరకు పరుగున వస్తుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎమోషనల్ అవుతారు. మిస్సమ్మ అక్కా నిన్ను మళ్లీ చూడటం సంతోషంగా ఉంది అక్కా అంటుంది. ఆరు కూడా నాకు చాలా సంతోసంగా ఉంది చెల్లి అని చెప్తుంది. ఇంతలో రాథోడ్ వస్తాడు. రాథోడ్‌కు విషయం అర్తమై చూస్తుంటాడు.
ఇంతలో లోపలి నుంచి అంజు వస్తుంది. మిస్సమ్మ మాట్లాడటం చూసి దగ్గరకు వస్తుంది. కోపంగా నాకు నిజం చెప్పండి.. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ.. అది కాదు అంజు అంటూ ఏదో చెప్పబోతుంటే.. అంజు మరింత కోపంగా మిస్సమ్మ మీరు నిజం చెప్పకపోయినా నాకు తెలుస్తుంది.. మీరు మా అమ్మతో మాట్లాడుతున్నారు కదా..? అని అడుగుతుంది. అంజు అలా అడిగేసరికి ఆరు ఎమోషనల్ అవుతుంది. మిస్సమ్మ షాక్ అవుతుంది. అంజు నేను చెప్పేది ఒకసారి విను అంజు అని చెప్తుండగానే…
అంజు ఏడుస్తూ.. బాధపడుతుంది. అమ్మ ఇక్కడే ఉంది కదా..? అని మిస్సమ్మను అడుగుతుంది. అంజు మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక మిస్సమ్మ చూస్తుంటుంది. ఇంతలో అంజు బాధగా అమ్మా.. అమ్మా.. అంటూ ఏడుస్తూ.. అమ్మా ఒక్కసారి కనిపించమ్మా.. నాతో మాట్లాడమ్మా… ఫ్లీజ్ అమ్మా.. నాకు ఒక్కసారి కనిపించు అమ్మ.. మిస్సమ్మకు ఎందుకు కనిపిస్తున్నావు నాకు ఎందుకు కనిపించడం లేదు అమ్మ.. నేను అంటే నీకు ఇష్టం లేదా అమ్మా… చెప్పమ్మా.. కనీసం నాతో మాట్లాడనైనా మాట్లాడమ్మా.. ఫ్లీజ్ అమ్మా అంటూ ఏడుస్తుంది. అంజు ఏడవడంతో మిస్సమ్మ, ఆరు ఏడుస్తారు.. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.