BigTV English

New Vehicle Accident : మీ కొత్త బండికి యాక్సిడెంట్ అయిందా…

New Vehicle Accident : మీ కొత్త బండికి యాక్సిడెంట్ అయిందా…
Body of car get damage by accident

New Vehicle Accident : ఎంతో ఆశపడి ఇష్ట పడి వాహనాలు కొంటూ ఉంటారు. ఇష్టమైన కలర్ , మోడల్ కోసం వెతికి శోధించి వాహనాలు కొనడం మనం చూస్తూ ఉంటాం. బైక్ అయినా, కారు అయినా కొనేటప్పుడు వాకబు చేసి మరీ వాహనాలు కొంటూ ఉంటాం. ఫ్యామిలీ అంతా కలిసి తిరిగేందుకు కారు కొంటే ఆ ఆనందమే వేరు. తీరా ఇష్టపడి కొన్న కొత్త వాహనానికి ఊహించని విధంగా ఒక్కోసారి ప్రమాదం జరిగితే ఆ బాధ చెప్పుకోలేం. మన తప్పు లేకపోయినా ప్రమాదం జరగచ్చు. ఇలా కొత్త వాహనానికి ప్రమాదం జరగడానికి కారణం దిష్టి కూడా కావచ్చంటున్నారు పండితులు.


మనుషులకి , ఇళ్లకే కాదు వాహనాలకి కూడా దిష్టి దోషాలు తగులుతుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కొత్త బండి కొన్నా కారు కొన్న వారు ఎవరైనా సరే నెలకోసారి యజమాని దిష్టి తీయాలి. అలా చేయడంవల్ల వాహనానికి ఎలాంటి సమస్యలు రావంటోంది శాస్త్రం. అయితే దిష్టి తీయడానికి అన్ని వేళలు పనిచేయవు. ఆదివారం అమావాస్య సమయంలో మాత్రమే దిష్టి తీయడానికి సరైన సమయం అని చెబుతున్నారు. దిష్టి తీసే ముందు వాహనాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి గంధం, కుంకమ బొట్లు పెట్టాలి.

నల్లటి వస్త్రంలో చిన్న పటిక ముక్క కట్టి వాహనానికి వేళాడ దీయాలి. రెండు నిమ్మకాలపై వాహనాన్ని ముందుకు నడిపాలి. శనివారం పూట మాత్రమే దిష్టి తీయాలని శాస్త్రం చెబుతోంది. ఇలా నెలకోసారి అయినా చేస్తూ ఉంటే వాహనానికి దిష్టి పోయి సమస్యలు రాకుండా ఉంటాయి. మొదటిసారి బండి కొన్న వారు ఒకసారైనా ఆంజనేయ స్వామి ఆలయంలో పూజ చేయిస్తే బండికి ఎలాంటి దిష్టి దోషమూ ఉండదు. ఆ వాహనానికి ఎలాంటి ప్రమాదాలు జరగవు. శివపార్వతులు ఉన్న చోట కారుకి పూజ చేయిస్తే మరీ మంచిదని పరిహార శాస్త్రం చెబుతోంది.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×