Brahmamudi serial today Episode: కావ్య డాక్టర్‌ను కలవడానికి వెళ్లి బయట వెయిట్ చేస్తుంటే.. డాక్టర్ నర్సును పిలచి కావ్య వచ్చిందా అని అడుగుతుంది. వచ్చిందని చెప్తుంది. మరి వెంటనే రమ్మను అని చెప్పగానే.. అంటే వచ్చారు కానీ వాష్ రూంకు వెళ్లారు అని చెప్తుంది. సరే వేరే వాళ్లను పంపమని చెప్తుంది. సరే అంటూ బయటకు వచ్చిన నర్సు.. రాజ్‌కు ఫోన్ చేసి ఇంకా ఎంత సేపు సార్ మీ వైఫ్ చాలా ప్రశ్నలు వేస్తున్నారు. త్వరగా రండి సార్ అంటుంది. రాజ్ ఇదిగో పటాన్ చెరువు దగ్గరే వస్తున్నాను.. అని చెప్పగానే..
ఏంటి మా డాక్టర్ అత్తగారి ఊర్లో వస్తున్నారా..? అంటుంది నర్సు శాంతి. దీంతో రాజ్ డాక్టర్ అత్తగారి ఇంటి అడ్రస్ ఇవ్వమని అడుగుతాడు. నర్సు మెసేజ్ చేస్తుంది. అడ్రస్ చూసుకుని రాజ్ నేను చెప్తే డాక్టర్ వినదు.. వాళ్ల అత్తయ్య చెబితే వినదా..? అంటూ వెళ్లిపోతాడు. హాస్పిటల్ లో కావ్య తర్వాత వచ్చిన వాళ్లు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్తుంటారు. ఇంతలో నర్సు రాగానే.. కావ్య తిడుతుంది. నా తర్వాత వచ్చిన వాళ్లు కూడా వెళ్తున్నారు నన్ను ఎందుకు పంపించడం లేదు అంటూ నిలదీస్తుంది. దీంతో శాంతి వాళ్లు మీకన్నా ముందే వచ్చారు మేడం.. చాలా మంది ఉన్నారని పక్కకు వెళ్లారు అని చెప్తుంది.
మరోవైపు డాక్టర్ అత్తగారి దగ్గరకు రాజ్ వెళ్తాడు. వాళ్ల అత్తను తన మాటలతో రెచ్చగొట్టి దొంగతనం నాటకం ఆడదామని చెప్తాడు. వెంటనే మీ కోడలికి ఫోన్ చేసి ఇక్కడకు పిలిపించండి అంటాడు సరే అంటూ ఒప్పుకుంటుంది డాక్టర అత్త. ఇంతలో రాజ్ తాడు, చైర్ తీసుకొచ్చి డాక్టర్ అత్తను చైర్‌కు కట్టేస్తాడు.
మరోవైపు డాక్టర్ నర్సును పిలుస్తుంది. లోపలికి వచ్చిన నర్సు మేడం పిలిచారేంటి మేడం అంటుంది. ఎవరెవరినో పంపిస్తున్నావు.. కావ్య మేడం రాలేదా ఇంకా…? అని అడగ్గానే.. వచ్చారు మేడం కానీ మీరు ఈ టైంకి టీ బ్రేక్ తీసుకుంటారు కదా. అందుకే పంపలేదు అని నర్సు చెప్తుంది. ఎప్పుడేం తీసుకోవాలో నాకు తెలుసు.. ముందు కావ్యను పంపించు ఆవిడతో నేను మాట్లాడాలి అని చెప్తుంది. దీంతో నర్సు బయటకు వెళ్లి డాక్టర్ గారు పిలుస్తున్నారు వెళ్లండి అని చెప్తుంది. థాంక్స్ అండి ఇప్పటికైనా నన్ను పంపిస్తున్నారు అంటూ లోపలికి వెళ్తుంది. నర్సు మాత్రం దేవుడా నేను కావ్య గారిని ఆపేసిన విషయం డాక్టర్ కు తెలియకుండా చూడు స్వామి అని మనసులోనే మొక్కుకుంటుంది..
కావ్య లోపలికి వెళ్లగానే.. డాక్టర్ రండి కావ్య గారు కూర్చోండి అని చెప్తుంది. దీంతో కావ్య డాక్టర్ గారు లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు ఏదేదో గొడవ జరిగిపోయింది. మీతో మాట్లాడే అవకాశమే దొరకలేదు ఆరోజు మా వారు చేసిన పనికి మీరు చాలా ఇబ్బంది పడ్డారని అర్థమైంది. ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను.. అంటుంది కావ్య. దీంతో డాక్టర్ ఒక భర్తగా ఆయన పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అండి. కానీ డాక్టర్‌గా నా బాధ్యత నేను చేయాలి కదా అంటుంది డాక్టర్. దీంతో కావ్య మేడం నేను ఇక్కడకు వచ్చింది ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవడానికి డాక్టర్.. ఆ రోజు మా ఆయన నాకు తెలియకుండా అబార్షన్ చేయించడానికి తీసుకొచ్చారు.
ఆయన ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను డాక్టర్. కానీ ఆయన చెప్పడం లేదు.. అందుకే మీ దగ్గరకు వచ్చాను ఫ్లీజ్ డాక్టర్ చెప్పండి అంటూ కావ్య అడగ్గానే.. అసలు ఏం జరిగిందంటే.. అంటూ డాక్టర్ చెప్పబోతుంటే.. ఇంతలో వాళ్ల అత్తగారి ఫోన్ నుంచి వీడియో కాల్ చేసి ఓసేయ్ తొందరగా ఇంటికి రావే.. అంటుంది. కట్లతో ఉన్నారేంటి..? అత్తయ్య ఎవరు మిమ్మల్ని ఇలా కట్టేశారు అంటుంది. ఎవడో దొంగ వెధవ దొంగతనానికి వచ్చాడు. బెడ్ రూంలో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాడు..నువ్వు వెంటనే రావే అని చెప్పగానే.. డాక్టర్ కంగారుగా కావ్య మా అత్తయ్య గారు డేంజర్‌లో ఉన్నారు నేను వెళ్తున్నాను.. మీతో తర్వాత మాట్లాడతాను అంటూ డాక్టర్ వెళ్లిపోతుంది.
ఇంటికి వెళ్లిన డాక్టర్ ఇంట్లో రాజ్, వాళ్ల అత్తయ్యను ఫోటోలు తీయడం చూసి షాక్ అవుతుంది. వెంటనే దగ్గరకు వెళ్లి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మా అత్తయ్యను కిడ్నాప్ చేయడం అనేది అంతా నాటకమేనా..? అంటుంది. దీంతో అవునని వాళ్ల అత్త చెప్తుంది. దీంతో డాక్టర్ జరిగిందంతా వాళ్ల అత్తకు చెప్తుంది. ఆమె షాక్ అవుతుంది.
ఇంటికి వెళ్లిన కావ్యను నిజం తెలిసిపోయిందా..? అని ఇంద్రాదేవి అడుగుతుంది. తెలియలేదు అమ్మమ్మగారు.. అని చెప్పగానే.. తెలసుకుంటానని హాస్పిటల్‌కు వెళ్లావు కదా అని అడగ్గానే.. వెళ్లాను కానీ డాక్టర్ అర్జెంట్ గా అవసరం రావడంతో నాతో మాట్లాడకుండానే వెళ్లిపోయింది అని చెప్తుంది. ఇంతలో కళ్యాణ్, ఇంద్రాదేవికి మోకాళ్ల నొప్పి ఆయిల్ తీసుకొచ్చి ఇస్తాడు. నేను రాజ్‌కు చెబితే నువ్వు తెచ్చావేంటి అని అడుగుతుంది.
అన్నయ్యకు ఏదో అర్జెంట్‌గా వర్క్ పడితే నన్ను తీసుకురమ్మన్నారు వెళ్లి తీసుకొచ్చాను.. ఏంటి వదిన అలా డల్లుగా ఉన్నారేంటి..? డాక్టర్‌ను కలవలేదు కదా..? అంటాడు దీంతో కావ్య షాకింగ్ గా నేను హాస్పిటల్ కు వెళ్లిన విషయం మీకెలా తెలిసింది. పైగా నేను డాక్టర్ ను కలవలేదన్న విషయం ఎలా తెలిసింది అంటూ అడగ్గానే.. కళ్యాణ్ షాక్ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.