Varahi Puja : వారాహి మాత పూజకు మొదట పూజకు అమ్మవారి పటం, లేకపోతే అమ్మ వారిని ఆవాహన చేస్తూ కలశం పెట్టవచ్చు. అది చేయలేకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అయిన అమ్మ ఈ దీప కాంతిని నీ రూపంగా భావిస్తున్నానని మనసులో అనుకుని 16 శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలు పెట్టాలి.
ఈ పూజకి విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు.
కానీ ప్రతి నెల 2 సార్లు వచ్చే పంచమి తిధిని మాత్రం వారాహి మాత పూజని గుండ్రంగా ఉండే 5 లడ్డులను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి.
అలాగే ఈమెకు రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు,సాయంకాలం 6 గంటల తర్వాతే మొదలు పెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు, ఇంట్లో అమ్మలకు నెలసరి వచ్చినప్పుడు, మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు.
వారాహి మాతకు పగటి పూజకంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతోంది.
పూజకు కావాల్సిన సామగ్రి
1.పసుపు
2.కుంకుమ
3.అగర్భత్తులు
4.దానిమ్మ పండు గింజలు
5.లడ్డులు
6.అమ్మ వారి చిత్రపటం,విగ్రహం,కలశం,
7 మన పెరటిలో వికసించిన పుష్పాలు
8.దానిమ్మ గింజాలు ఒక గుప్పెడు