Liger : టాలీవుడ్ అందరికీ బంగారు బాతు ఏమీ కాకపోవచ్చు. ఎంతో ఎత్తుకు ఎదిగే వారు కొందరైతే.. అంతెత్తు నుంచి పాతాళానికి పడిపోయే వారు మరికొందరు. నిత్యం వివాదాలు వెంటాడే వాళ్లు ఇంకొందరు. ఇలా, గుడ్ అండ్ బ్యాడ్ షేడ్స్ అనేకం ఉన్న వ్యక్తులు ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది పూరి & చార్మి. మోస్ట్ ట్రెండింగ్ పీపుల్ ఇన్ టాలీవుడ్.
పూరి జగన్నాథ్. స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్. స్ట్రాంగ్ కంటెంట్ ను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయగల దమ్మున్న దర్శకుడు. బద్రి, ఇడియట్, పోకిరి, చిరుత, బుజ్జిగాడు, బిజినెస్ మెన్, టెంపర్, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్.. ఇలా ఎన్నో సూపర్ హిట్స్ ఆయన సొంతం. ఎంతో సంపాదించి.. అంతా పోగొట్టుకొని.. మళ్లీ జీరో నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన డైనమిక్ పర్సన్. అలాంటి పూరి లైఫ్ లో వివాదాలూ ఉన్నాయి. డ్రగ్స్ మరక ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉంది. లేటెస్ట్ గా, లైగర్ మూవీ ఫ్లాప్ నుంచి కోలుకోక ముందే ఆయన్ను ఈడీ వెంటాడటం మరింత సంచలనం.
పూరి జీవితం.. ఒక పర్సనాలిటీ మేనేజ్మెంట్ పుస్తకం. ఇటీవల వివాదాలే ఆయన కేరాఫ్ అడ్రస్ గా మారాయి. చార్మి టచ్ లోకి వచ్చాకే.. పూరికి బ్యాడ్ లక్ స్టార్ట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నా.. ఆమే తన బలం అంటూ జగన్నాథ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. వారిద్దరి రిలేషన్ పై ఎన్ని గాసిప్స్ ఉన్నా.. పలు కాంట్రవర్సీల్లో వాళ్లిద్దరి పేర్లు కలిసే ఉండటం ఆసక్తికరం.
గతంలో డ్రగ్స్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించింది తెలంగాణ ఆబ్కారీ శాఖ. వారిలో పూరి, చార్మి పేర్లు ముందున్నాయి. వాళ్లిద్దరు డ్రగ్స్ వాడేవారని.. వారి నుంచి ఇతర ప్రముఖులకూ డ్రగ్స్ అందాయనేది ఆరోపణ. ఆ కేసు కొలిక్కిరాకుండా ఇంకా సా..గుతూనే ఉంది.
డ్రగ్స్ మరకను పట్టించుకోకుండా.. సినిమాలపైనే ఫోకస్ పెట్టారు ఆ ఇద్దరు. వరుస ఫ్లాప్ ల తర్వాత ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇక మునుపటి పూరిని చూస్తామని ఫ్యాన్స్ సంబరపడేలోగా.. లైగర్ తో డిజాస్టర్ ఇచ్చి.. నేనింతే అనిపించుకున్నారు. కరోనా టైమ్ లో అష్టకష్టాలు పడి తీసిన లైగర్.. అట్టర్ ఫ్లాప్ అవడంతో.. డ్యామిట్, కథ అడ్డం తిరిగింది. అయ్యో పాపం అనుకుంటుండగానే.. డిస్టిబ్యూటర్లతో గొడవ వచ్చి పడింది. లైగర్ నష్టాలను భర్తీ చేయాల్సిందేనంటూ వారంతా ఆందోళనకు సిద్దమవడం.. పూరి సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం.. ఎమోషనల్ వీడియో, లెటర్ రిలీజ్ చేయడం.. హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఇలా లైగర్ కష్టాలు అన్నీఇన్నీ కావు.
ఇవి చాలవన్నట్టు.. ఈడీ రూపంలోనూ లైగర్ డ్యామేజ్ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ సినిమాకు విదేశాల నుంచి పెట్టుబడిగా డబ్బులు వచ్చినట్టు చూపించడంపై పూరి, చార్మిలను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఇక్కడి నుంచి దుబాయ్ కు డబ్బులు వెళ్లడం.. మళ్లీ అక్కడి నుంచి పెట్టుబడిగా తిరిగి రావడం.. ఈ దందా వెనుక ఓ రాజకీయ నేత ప్రమేయం ఉండటంపై.. వారిద్దరిని ఈడీ లోతుగా ప్రశ్నించింది. ఇలా, పూరి అండ్ చార్మిలు పదే పదే కాంట్రవర్సీలతో బ్రేకింగ్ న్యూస్ గా మారడం రొటీన్ గా మారుతోంది. అంతా అంటున్నట్టు.. పూరికి చార్మి ఐరన్ లెగ్ గా మారిందా? ఆర్జీవీ శిష్యుడైన పూరి ఇలాంటివి పట్టించుకుంటారా? గోడకు కొట్టిన బంతిలా మరింత స్ట్రాంగ్ గా నిలబడతారా?