BigTV English

Varahi Puja : వారాహి పూజ మధ్యలో ఆపాల్సి వస్తే ఏం చేయాలి

Varahi Puja : వారాహి పూజ మధ్యలో ఆపాల్సి వస్తే ఏం చేయాలి
Varahi Puja


Varahi Puja : వారాహి నవరాత్రులను భద్రకాళీ నవరాత్రులుగా కూడా జరుపుతారు. దక్షిణభారతదేశంలో శాకాంబరి నవరాత్రులుగా కూడా కొలుస్తారు. వీరభద్రస్వామి కులదైవంగా ఉండే ఇంట్లో భద్రకాళి నవరాత్రులు చాలా ముఖ్యమైనవిగా చెబుతారు. ఈ నవరాత్రుల సందర్భంగా ఆలయాల్లో సామూహిక పూజలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నవరాత్రులతోపాటు మిగతా సప్తమాతృకులను కూడా పూజిస్తారు. వారాహి అమ్మవారు సప్తమాతృకుల్లో ఒకరు. ఇలా కొన్ని ప్రాంతాల్లో జరుపుతారు. ఆషాఢ మాస పాడ్యమి రోజు వారాహి మాతను ఉన్మత్త వారాహిగా కొలుస్తారు. వారాహి క్షేత్ర పాలకుడు ఉన్మత్త బైరవుడు. వారాహి కుబేర ఉపవాసకులు తొలుత ఉన్మత్త భైరవుడ్ని ఉపాసన చేయాల్సి ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటే వారాహి పూజలు ఫలిస్తాయని శాస్త్రం చెబుతోంది.

నవరాత్రుల్లో రెండో రోజు విదియ. ఆ వేళ బృహత్ వారాహిగా పూజిస్తారు. మూడో తదియ ఆవేళ అమ్మవారిని స్వప్న వారాహిగా కొలుస్తారు.నాలుగో రోజు కిరాత వారాహిగా పూజిస్తారు. ఐదో రోజు పంచమి తిథి నాడు శ్వేత వారాహిగా పూజిస్తారు. ఐదో రోజు పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు. ఆరో రోజు షష్ఠి ధూమ్రవారాహిగా కొలుస్తారు. ఏడవ రోజు సప్తమి నాడు మహా వారాహిగా అమ్మవారిని ఆరాధిస్తారు. ఎనిమిదో రోజు అష్టమి వార్తాలి వారాహిగా పూజిస్తారు. తొమ్మిదవ రోజు నవమి ఆ రోజున దండిని వారాహిగాను, పదో రోజు దశమి నాడు ఆది వారాహి మహపూజగా కొలుస్తారు.


అమ్మవారి అన్ని రూపాలకు అష్టోత్తరాలు, శ్లోకాలు లేవు. ప్రతీ రోజు అమ్మవారి ధ్యాన శ్లోకాలను చదువుకోవచ్చు. వారాహి మాత అష్టోత్తరాలు, సహస్రనామాలతో మన శక్తిని నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజించవచ్చు. వారాహి నవరాత్రుల పూజ సాయంత్రం ఏడు గంటల నుంచి చేసుకుంటే మంచిది. అమ్మవారు రాత్రి దేవత కాబట్టి చీకటి పడిన తర్వాత పూజను ఆచరించాలి. ఏవైనా ఆటంకాలు వచ్చి పూజ చేయలేని వారు పంచమి లేదా అష్టమి, మంగళ, శుక్రవారాల్లో పూజ చేసుకోవచ్చు. ఉగ్రరూపంలో ఉండే శాంతదేవత. పరమశివుడిలాగా వరాలు కురిపించే ఈ దేవతను ఎవరైనా మొక్కవచ్చు. అమ్మవారిని ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి తప్పు ఉండదు. విగ్రహం పెట్టుకునే వారు మాత్రం కచ్చితంగా నియమాలు పాటించి నిష్టగా ఉండాలి. ఎలాంటి తప్పులు చేయకూడదు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×