BigTV English

Vijay Devarakonda marriage : పెళ్లి గురించి విజయ్ దేవరకొండ పోస్ట్.. ఫ్యాన్స్‌లో డౌట్స్..

Vijay Devarakonda marriage : పెళ్లి గురించి విజయ్ దేవరకొండ పోస్ట్.. ఫ్యాన్స్‌లో డౌట్స్..
Vijay Devarakonda


Vijay Devarakonda marriage news(Latest tollywood updates) : సినీ పరిశ్రమలో నటించే చాలామందిపై నెటిజన్ల ఫోకస్ ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా.. దాని వెనుక అర్థమేంటి అని అభిమానులు తెగ తికమక పడిపోతుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కూడా ఇలాగే తన ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేసింది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు బయట మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లలో విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో కూడా ఈ హీరోతో కలిసి నటించాలని కోరుకునే అమ్మాయిలు చాలామందే ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ సింగిల్ అంటే మాత్రం చాలామంది నమ్మడానికి సిద్ధంగా ఉండరు. కన్నడ బ్యూటీ రష్మికతో తనకు ఉన్న సాన్నిహిత్యమే దీనికి కారణం.


విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ఇప్పటివరకు రెండు సినిమాల్లో కలిసి నటించారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వీరిద్దరి కెమిస్ట్రీకి మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఈ సినిమాల షూటింగ్ సమయం నుండే వీరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఎక్కువగా కలిసి బయటికి వెళ్లేవారు. అలా వెళ్లిన సమయాల్లో కెమెరాల కంటికి చిక్కేవారు. దీంతో వీరిద్దరు లవర్స్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ వీరిద్దరూ మాత్రం తాము ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్తూ వస్తున్నారు.

తాజాగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత అల్లరిగా, ఆనందంగా ఉంటుంది అని చెప్పే వీడియో ఒకటి షేర్ చేశాడు విజయ్. దీంతో విజయ్‌కు సడెన్‌గా పెళ్లి గురించి వీడియో ఎందుకు పోస్ట్ చేయాలనిపించింది. ఒకవేళ తను కూడా పెళ్లికి సిద్ధమయ్యాడా. అసలు తను చెప్తున్న ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు.. ఇలా ఫ్యాన్స్‌లో చాలా అనుమానాలు మొదలయ్యాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×