Solar Village: ప్రకృతితో మమేకమైన పండుగ దసరా పండుగ. దసరా పండుగ రోజు జమ్మి చెట్టు నుంచి ఆకులు తీసుకుని, పాలపిట్టను చూసి సంతోషంగా గడుపుతారు ప్రజలు. కానీ ఈ రోజుల్లో పాలపిట్టను చూద్దామన్న కనిపించడం లేదు. కాలుష్యం కాటుకి అంతరించిపోతున్నాయి. పల్లెటూర్లలో పంట పొలాల దగ్గర అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. దసరా రోజు గుడిలో… పంజరంలో బంధి అయ్యి కనిపిస్తాయి. ఇలా పంజరంలో పాలపిట్టను బంధించడం వల్ల వాటి జనాభా తగ్గుతుందంటున్నారు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ ఫౌండర్ ప్రదీప్ నాయర్. పాలపిట్టలను బంధించే వారిపైన చట్టపరమైన శిక్షలు తీసుకోవాలంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మా ప్రతినిధి పాపన్న అందిస్తారు.
దేశంలోనే సోలార్ విద్యుత్‌లో రెండవ గ్రామంగా నిలిచింది నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి. దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి సంపూర్ణ సోలార్ విద్యుత్ గ్రామంగా ఆదర్శంగా నిలుస్తుంది. ఈ గ్రామంలో ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టే పనిలేదు.. తిరిగి వారికే ఆదాయం వస్తుంది. పర్యావరణ హితమైన సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ఆ గ్రామానికి వరంలా మారింది.. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైలెట్ ప్రాజెక్టుగా ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సంపూర్ణ సౌరవ్ విద్యుత్ గ్రామంగా అభివృద్ధి చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Motorola phone: మోటరోలా ఫోన్ షాకింగ్ ఫీచర్స్!.. ఫోటోలు, వీడియోస్, గేమ్స్ ఏదైనా సులభం!
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం ఇది..ఇప్పుడు సౌర విద్యుత్ వెలుగులతో కళకళలాడుతుంది. గ్రామంలోని మొత్తం 514 ఇళ్లపై ఈ సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలోని అన్ని కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఇంటికి మూడు కిలోవాట్ల సామర్థ్యంతో ఈ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో 100 నుండి 150 యూనిట్స్ మాత్రమే ఆయా ఇళ్లకు వినియోగం జరుగుతుంది. మిగిలిన విద్యుత్ ను గ్రిడ్స్ కు అనుసంధానం చేశారు.
విద్యుత్ గ్రిడ్ కి విక్రయించడం ద్వారా ఒక్కో యూనిట్ కి 5.25 రూపాయలు చెల్లింస్తుంది. గత సెప్టెంబర్ నెలలో గ్రామం మొత్తం విద్యుత్ గ్రిడ్డుకు లక్ష యూనిట్ల విద్యుత్ ఎగుమతి జరిగిందిగత సెప్టెంబర్ నెలలో గ్రామం మొత్తం విద్యుత్ గ్రిడ్డుకు ఎగుమతి జరిగింది. దీంతో గ్రామస్తులకు ఒక్క నెలలో ఐదు లక్షల రూపాయల ఆదాయం చేకూరుతుంది. దీంతో విద్యుత్ బిల్లులు కట్టే పన్ను లేకుండా తిరిగి సోలార్ విద్యుత్ ద్వారా తమకే ఆదాయం రావడంతో కొండారెడ్డిపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్లనే కొండారెడ్డిపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా అభివృద్ధిలో ముందుకు వెళుతుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.