BigTV English
Advertisement

Ashada Masam Tradition : ఆషాఢ మాసంలో గోరింటాకు సంప్రదాయం ఎలా మొదలైంది

Ashada Masam Tradition : ఆషాఢ మాసంలో గోరింటాకు సంప్రదాయం ఎలా మొదలైంది
Ashada Masam


Ashada Masam Tradition : ఆషాఢ మాసంలోనే వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడప్పుడే చినుకలు మొదలవుతుంటూ ఉంటాయి. వాతావరణం మారుతుంది. అప్పటి వరకు ఎండ వేడితో భూమి వేడెక్కి ఉంటుంది. వాన రాకతో భూమి నుంచి ఆవిరి బయటకి వస్తుంది. దీనివల్ల వాతావరణంలో విచిత్రమార్పులు వస్తుంటాయి. రుతువులో మార్పు వల్ల కలిగే ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. రోగ కారక క్రిములు బయటకి వస్తుంటాయి. వాన రాకతో గాలిలో, నీటిలో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ ప్రభావం వల్ల ఎన్నో రకాలు క్రిములు కీటకాలు వ్యాపిస్తాయి. కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు చేతులు పాదాల ద్వారా చర్మ రంధ్రాల నుంచి శరీరంలోకి ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా ఉంటుంది. ఎక్కువమంది మహిళలు ఎక్కువగా వంటపనులు, ఇంటిపనులు కూడా చేస్తూ ఉంటారు. చేతులు నీళ్లల్లో తడపాల్సిన అవసరం వస్తుంటుంది . అందులో ఉండే క్రిమికీటకాల ప్రభావం సోకకుండా గోరింటాకు సహాయ పడుతుంది. గోరింటాకులో ఉండే రసాయన చర్య చర్మ రక్షణకు ఉపయోగపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు ఆషాఢమాసంలో గోరింటాకు ఆచారాన్ని మనకు పరిచయం చేశారు.

పేరు గోరింటాకు అయినా గోళ్లతోపాటు అరచేయికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు.గోరింటాకు పెట్టుకోవడంలో కొన్ని ప్రాంతాల్లో నియమాలు కూడా ఉన్నాయి. వేళ్లకి గోరింటాకు పెట్టుకునేటప్పుడు అన్నలు ఉన్న వాళ్లు ఈ వేళ్లకు పెట్టుకోకూడని తమ్ముళ్లు ఉన్న వారు ఈ వేలికి పెట్టుకోకూడదని ఇలాంటి నియమాలు కూడా ఉన్నాయి. పెళ్లికాని అమ్మాయిలైతే ఆషాఢమాసంతో సంబంధం లేకపోయినా అందం కోసం గోరింటాకు పెట్టుకుంటారు.


గోరింటాకు పెట్టుకోవడంలో ఆనందం, అలంకరణే కాకుండా ఆరోగ్యదృష్టితో సనాతన భారతీయ సంప్రదాయం ఇలాంటి ఎన్నో ఆచారాలు పెట్టింది. పాదాలకు కూడా తడి తగులుతూ ఉంటుంది కాబట్టి గోరింటాకు కాళ్లకు కూడా రక్షణగా నిలుస్తుంది. పురుషులు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. కానీ మహిళల కోసం ఈ ఆచారం పెట్టడం జరిగింది. మహిళల కోసమే ఈ ఆచారం పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఇదే. అందుకే ఆషాఢమాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవాలన్న ఆచారం పెట్టారు మన పూర్వీకులు.

గోరింటాకు అలంకరణలో భాగమే అయినా ఈ ఆచారం వెనుక ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మహిళల చేతులు, పాదాల అందాన్నిగోరింటాకు పెంచుతుంది. అంతేకాదు, గోరింటాకు ఒత్తిడిని, వేడిని తగ్గిస్తుంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీని వల్ల గర్భాశయ దోషాలు పోతాయని ఆయుర్వేదం చెబుతోంది.

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×