MP Couple Buries Child: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ ఉపాధ్యాయుడు అప్పుడు పుట్టిన తన బిడ్డను హత్య చేయాలని చూశాడు. ఈ దారుణానికి కన్నతల్లి కూడా సహకరించింది. కనికరం లేకుండా చిన్నారిని కారడవిలో సమాధి చేశారు. అడవిలో శిశువు ఏడుపు విన్న స్థానికులు.. ఆ బిడ్డను రక్షించారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని అడవి ప్రాంతంలో మూడు రోజుల పసికందును ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, అతని భార్య సజీవంగా పాతిపెట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల విధానం అమలు చేయడంతో ఉద్యోగం కోల్పోతామన్న భయంతో ఆ దంపతులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
చింద్వారా జిల్లా ధనోరా ప్రాంతంలోని నందన్‌వాడి గ్రామంలో ఆదివారం (సెప్టెంబర్ 26) ఒక పసికందును తల్లిదండ్రులు బబ్లూ దండోలియా (38), రాజకుమారి (28) సజీవంగా పాతిపెట్టారు. బాలుడి ఏడుపు గమనించిన గ్రామస్తులు.. పసికందును బయటకు తీసి సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నాడు బబ్లూ దంపతులను అరెస్టు చేశారు.
బబ్లూ, రాజకుమారి 2009 నుండి చింద్వారా జిల్లాలోని ఒక ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లల విధానం కారణంగా తమ ఉద్యోగాలు పోతాయని భయపడి ఈ దారుణానికి పాల్పడినట్లు వీరద్దరూ నేరం అంగీకరించారు.
బబ్లూ దంపతులకు 11 ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఇటీవల రాజకుమారి మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రభుత్వం నిబంధనల మేరకు.. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న బబ్లూ దంపతులకు తన ఉద్యోగాలు పోతాయని భయం మొదలైంది. అయితే తన భార్య రాజకుమారి గర్భిణీ కావడంతో బిడ్డ పుట్టిన వెంటనే చంపేయాలని, లేదంటే ఉద్యోగం పోతుందని భార్యను ఒప్పించాడు. భార్య గర్భం దాల్చినట్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సెప్టెంబర్ 23న రాజకుమారి మగబిడ్డను జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వెంటనే బబ్లూ పసికందును అడవిలో బండరాళ్ల మధ్య సజీవ సమాధి చేశాడు.
Also Read: Rabi Crops MSP Hike: పండుగ పూట రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఆరు పంటల మద్దతు ధరలు పెంపు
మూడు రోజుల తర్వాత చిన్నా ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.