BigTV English

Ugadi:అసలు తొలి ఉగాది ఎప్పుడు ప్రారంభమైంది?

Ugadi:అసలు తొలి ఉగాది ఎప్పుడు ప్రారంభమైంది?

Ugadi:ఉగాది అంటే ‘కొత్త యుగం ప్రారంభమని అర్థం. హిందూ పంచాంగ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫాల్గుణ మాసం, శుభకృత నామ సంవత్సరం మార్చి 21న ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి 22 నుంచి చైత్ర మాసం ప్రారంభం అవుతుంది. చైత్ర మాసం ప్రారంభమయ్యే మొదటి రోజునే ఉగాదిగా జరుపుకుంటాం. ఆరోజు నుంచే ‘శోభకృతు నామ సంవత్సరం’ ప్రారంభం అవుతుంది. శోభకృత నామ సంవత్సరంలో మార్చి 22న బుధవారం రోజు ఉగాది పండుగను జరుపుకుంటున్నాం.


యుగమనే ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుంచి ఫాల్గుణం పూర్తయ్యే వరకు ఉన్న సమయాన్ని యుగం అని అంటారు. విష్ణుసహస్ర నామం భగవంతుణ్ని యుగాదికృత్‌ అని సంబోధించింది. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలతో కూడిన 4 యుగాలను శ్రీకృష్ణుడు తన అవతారాలలో ఆరంభించాడని తెలియజేస్తుంది. ప్రస్తుత ఉగాది కలియుగ ఆరంభాన్ని సూచిస్తుంది. ద్వాపర యుగాంతంలో కృష్ణ భగవానుడు వైకుంఠానికి వెళ్లిన రోజే కలియుగం ఆరంభమైందని ప్రాచీన పండితులు వివరించారు.

యుగమంటే 2 లేదా జంట అని అర్ధం. ఉత్తరాయణము, దక్షిణాయణము కలిపి ఒక యుగము పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను హరించి సముద్ర గర్భంలో దాగిఉండగా మత్స్యవతారమైనటువంటి విష్ణువు సోమకుడిని వధించి బ్రహ్మకు వేదాలను తిరిగి అప్పగించి ఈ సృష్టిని బ్రహ్మ తిరిగి ప్రారంభించిన రోజుగా ఉగాదిగా అలా సోమకుని సంహరించి సృష్టి ప్రారంభమైన రోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి ఉగాది యుగమునకు ఆది ఉగాదిగా మన పురాణాలు చెబుతున్నాయి.


కలియుగం దోషసాగరమే అయినప్పటికీ కేవలం హరేకృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా మనిషి భవబంధ విముక్తుడై పరంధామానికి చేరతాడని శ్రీమద్భాగవతం చెబుతోంది. కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం. ఆ యుగ ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు తాను ముందుగా చెప్పినట్టు ఐదువందల సంవత్సరాల కిందట శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి హరినామ సంకీర్తన ఉద్యమానికి నాంది పలికాడు. ఈ పరమ పావనమైన ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది పచ్చడిని శ్రీకృష్ణ భగవానుడికి నివేదించి, ప్రసాదంగా తీసుకోవాలి. హరేకృష్ణ మహామంత్రాన్ని

Tags

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×