BigTV English
Advertisement

Mahesh – Chiranjeevi : మ‌హేష్ సినిమా రిలీజ్ లేన‌ట్లే..సూప‌ర్‌స్టార్ ప్లేస్‌లో మెగాస్టార్ సంద‌డి

Mahesh – Chiranjeevi : మ‌హేష్ సినిమా రిలీజ్ లేన‌ట్లే..సూప‌ర్‌స్టార్ ప్లేస్‌లో మెగాస్టార్ సంద‌డి
Mahesh - Chiranjeevi

Mahesh – Chiranjeevi :సూప‌ర్‌స్టార్ మ‌హేష్ రావాల్సిన ప్లేస్‌లో మెగాస్టార్ చిరంజీవి సంద‌డి చేయ‌బోతున్నారు. ఇంత‌కీ ఏంటా ప్లేస్‌.. మ‌హేష్ స్థానంలో చిరంజీవి రావ‌టం ఏంట‌నే సందేహం రావ‌చ్చు. వివ‌రాల్లోకి వెళితే.. సూప‌ర్‌స్టార్ మహేష్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో SSMB 28 రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మ‌హేష్ త‌ల్లిదండ్రులు కృష్ణ‌, ఇందిరా దేవి క‌న్నుమూయ‌టంతో సినిమా షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం జ‌ర‌గ‌లేదు. దీంతో ఆగ‌స్ట్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. బాహాటంగా రిలీజ్ డేట్ చెప్పుకుంటూ వ‌చ్చారు.


అయితే ఇప్పుడు ఆగ‌స్ట్ 11న కూడా మ‌హేష్ SSMB 28 రావ‌టం లేదు. ఆ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి .. భోళా శంక‌ర్ సినిమా రిలీజ్ కానుంది. ఉగాది సంద‌ర్భంగా మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. త‌మిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్‌. మెహ‌ర్ ర‌మేష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో న‌టిస్తోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం నిర్మాతగా అనీల్ సుంకర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన మెగాస్టార్ మ‌రో సినిమాతో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు మ‌రి.

మ‌హేష్ సినిమా ఈ ఏడాదిలో లేక‌పోవ‌చ్చున‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. SSMB 28 వ‌చ్చే ఏడాది సంక్రాంతికే విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి మహేష్ మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత‌లు, త్రివిక్ర‌మ్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×