BigTV English

Kashi Prasadam : కాశీ ప్రసాదంలో మార్పు ఎందుకు చేశారంటే…..

Kashi Prasadam : కాశీ ప్రసాదంలో మార్పు ఎందుకు చేశారంటే…..
Kashi Prasad

Kashi Prasadam : కాశీ విశ్వనాథ దేవాలయంలో మిల్లెట్‌లతో చేసిన లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. మిల్లెట్ ప్రసాదానికి శ్రీ అన్న ప్రసాదంగా పేరు పెట్టారు.
ఈ లడ్డూలను మినుములు, నువ్వులు, బెల్లం, దేశీ నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. ఈ ప్రసాద తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. దేశీ నెయ్యిలో మినుములు, నువ్వులు, బెల్లం కలిపి లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు ప్రసాదాన్ని పిండి, సెమోలినా, జీడిపప్పు మరియు బాదంతో తయారు చేసేవారు. . ఇప్పుడు సిద్దం చేసే లడ్డూలపై “ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023” లోగో కూడా ఉంటుంది.


100 గ్రాములు మరియు 200 గ్రాముల ప్యాక్‌లలో ప్రసాదాలను విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మహిళా సంఘాలకు శిక్షణ కూడా ఇచ్చారు. లడ్డూల తయారీ, నాణ్యత ప్యాకింగ్‌ను వారణాసి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ పరీక్షించారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. దేశంలో ఎప్పటి నుంచో మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా జొన్న, బజ్రా మరియు మొక్కజొన్న వంటి ముతక తృణధాన్యాలను ప్రోత్సహించడానికి కేంద్రం వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతోంది.

చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం కూడా తన వంతు ముందుకొచ్చింది. .చిరుధాన్యాలు, బెల్లం, నువ్వులు, బాదం, జీడిపప్పు, నెయ్యి, ఖోయాల మిశ్రమంతో శ్రీ అన్న ప్రసాదం తయారు చేస్తారు. శ్రీ అన్న ప్రసాదాల విక్రయాలకు ఆలయ ప్రాంగణంలో కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం’.. అని మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతా జైస్వాల్ తెలిపారు.


for more updates follow – Bigtv

Tags

Related News

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Big Stories

×