Cold Water Swimming: చల్లటి నీటిలో ఈతకొట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునూ వారు చల్లటి నీరున్న సరస్సులు , నదుల్లో ఈత కొట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డెన్మార్క్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఈత కోసం చల్లటి నీటి సరస్సులు ,నదులల్లో క్రమం తప్పకుండా ఈతకొట్టడం ద్వారా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. అంతే కాకుండా ఈ ప్రక్రియ వేగంగా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. పరిశోధకుల ఈ అధ్యయనం సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడింది.
చల్లని నీటిలో ఈత కొట్టే వ్యక్తులు 24 గంటల్లో 500 కేలరీలు బర్న్ చేస్తారని రుజువైంది. డానిష్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే చల్లటి నీటిలో ఈత కొట్టేవారు 24 గంటల్లో 500 కేలరీలు బర్న్ చేస్తారు. వారానికి రెండు మూడు సార్లు చల్లని నీటి సరస్సులు, నదుల్లో ఈదుతూ ఎనిమిది మందితో కూడిన బృందంపై జరిపిన అధ్యయనం తర్వాత పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈత తర్వాత వ్యక్తుల శరీర ఉష్ణోగ్రత సాధారణ వ్యక్తుల కంటే వేగంగా పెరుగుతుంది. దీని కారణంగా ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. ఫలితంగా 24 గంటల్లో అదనంగా 500 కేలరీలు బర్న్ అవుతాయి.
చల్లటి శరీరాలు తమను తాము వేడెక్కించుకోవడానికి చాలా కష్టపడతాయి:
సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం శీతాకాలంలో చల్లని నీటిలో ఈత కొట్టిన తర్వాత శరీర ఉష్ణోగ్రత చాలా తగ్గుతుందని కనుగొంది. అటువంటి పరిస్థితిలో, శరీరం వేడెక్కడానికి చాలా కష్టపడాలి. దీని వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.
చల్లని నీటిలో ఈత కొట్టే వ్యక్తు శరీరం బయటి ఉష్ణోగ్రతలను ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఇలా బరువు కోల్పోయే అవకాశం ఉంది, ఇది సాధారణంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గడమే కాకుండా రక్తప్రసరణ పెరిగి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్తం మన శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. తద్వారా మనం వెచ్చగా ఉండగలుగుతాము.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరానికి సంబంధించిన అనేక వ్యాధులను నయం చేస్తుంది. అంతే కాదు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల తెల్ల రక్త కణాలు విడుదలవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
చర్మం, జుట్టుకు మేలు:
చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంతో పాటు జుట్టుకు కూడా చాలా మేలు జరుగుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. చికాకుగా కూడా అనిపిస్తుంది. అయితే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంతో పాటు జుట్టుకు మేలు జరుగుతుంది.
Also Read: మైగ్రేన్ ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని పనులు !
కోల్డ్ కంప్రెషన్ లాగా పనిచేస్తుంది:
శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మీ కండరాల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఇది కోల్డ్ కంప్రెషన్ లాగా పనిచేస్తుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:
మీరు చల్లటి నీటితో స్నానం చేస్తే, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. అదే సమయంలో, చల్లటి నీటితో స్నానం చేయడం మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కూడా ఉంటుంది.