IPL 2025 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ సంవత్సరం మార్చి 21వ తేదీ మంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు… భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా ( Rajeev Shukla ) ప్రకటన చేశారు. ఈ మేరకు మీడియాకు వెల్లడించారు రాజు శుక్లా.
Also Read: India Women Team Record: వన్డేల్లో మహిళల జట్టు సరికొత్త రికార్డు…హైయెస్ట్ టోటల్ నమోదు.. ఎంతంటే?
అలాగే మే 25వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ( Gardens of Eden ) … వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. అతి త్వరలోనే ఐపీఎల్ కొత్త కమిషనర్ కూడా రాబోతున్నట్లు తెలిపారు. అతన్ని త్వరలోనే ఎన్నుకుంటామని వివరించారు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా ( Rajeev Shukla ).
BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ( Rajeev Shukla ) ప్రకటన ప్రకారం… ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానుందన్న మాట. ఇక IPL 2025 ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగనుంది. అంతకు ముందు, IPL యొక్క 2024 ఎడిషన్ మార్చి 22న ప్రారంభమైంది. ఫైనల్ మే 26న KKRతో జరిగింది. అప్పుడు హైదరాబాద్ పై కేకేఆర్ విజయం సాధించింది. అందుకే ఇప్పుడు మే 25వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ( Gardens of Eden ) … వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ( Rajeev Shukla ).
Also Read: Rohit Sharma: నా వల్ల కాదు.. టీమిండియాకు కొత్త కెప్టెన్ ను పెట్టుకోండి !
ఇది ఇలా ఉండగా…. ఐపిఎల్ 2025 మెగా వేలంలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల ఈవెంట్‌లో మొత్తం 182 మంది ఆటగాళ్లు రూ. 639.15 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యారు. భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడు పోయాడు. భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ( Rishabh pant) రూ. 27 కోట్లకు లక్నో సూపర్ జెంట్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ( Rishabh pant). తర్వాత శ్రేయాస్ అయ్యర్ (రూ. 26.75 కోరెర్), వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) ఉన్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా మరియు శార్దూల్ ఠాకూర్ వంటి వారు అమ్ముడు పోలేదు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ( MS Dhoni ) కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ కింద CSK తరఫున ఆడతాడు.
IPL 2025 TO KICK OFF FROM 21ST MARCH.
– Final will be played at the Eden Gardens on 25th May. (Sportstar). pic.twitter.com/9SktYwqkuE
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025