Big Stories

Cholesterol Diet: మందు, మాంసం.. శరీరంలో కొవ్వును చెంచేస్తాయి..!

Alcohol and Meat will Increase the Cholesterol in Body: ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లతో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. తరచూ హడావిడీ జీవనశైలి కొనసాగిస్తూ తినడానికి కూడా సమయం లేని జీవితాలు గడుపుతున్నారు. ఈ తరుణంలో ఇంట్లోని ఆహారం కంటే బయట ఫుడ్ తినడానికే అలవాటు పడుతున్నారు. ఈ తరుణంలో ఉబకాయం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే శరీరంలో కొలస్ట్రాల్ అనేది పెరగకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

మానవ శరీరంలో రెండు రకాల కొలస్ట్రాల్ ఉంటాయి. ఒకటి చెడు కొలస్ట్రాల్, రెండోది మంచి కొలస్ట్రాల్. శరీరంలో చెడు కొలస్ట్రాల్ పిరణామాలు పెరిగినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. చెడు కొలస్ట్రాల్ అనేది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తరచూ తీసుకునే ఆహారం వల్లే కొలస్ట్రాల్ సమస్యలు తలెత్తుతాయని కూడా అంటున్నారు. అయితే ఆహారపు అలవాట్ల పట్ల అధిక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం అని అంటున్నారు.

- Advertisement -

Also Read: ‘బ్లూ టీ’.. ఎప్పుడైనా తాగారా.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మానేయాలి. మాంసం కొలస్ట్రాల్‌ను బాగా పెంచుతుంది. అందువల్ల మాంసాహారానికి దూరంగా ఉండాలి. మరోవైపు ఆల్కహాల్ ను కూడా మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొలస్ట్రాల్ ను తగ్గించడంలో తోడ్పడే అహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. ముఖ్యంగా ధాన్యాలను తీసుకోవాలి. పోషకాలు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరంలోని కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు తోడ్పడుతాయి. గుడ్లు, ధాన్యం, గోధుమలు, పప్పులు వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News