Big Stories

Game Changer North Theatrical Rights: రేయ్.. రేయ్.. ఇంకా టీజర్ కూడా రిలీజ్ అవ్వకముందే ఏంట్రా ఇది..?

Rs. 75 Crores for Game Changer North Theatrical Rights: ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు రేంజ్ వేరు.. ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు రేంజ్ వేరు. అసలు అప్పట్లో ఏ హీరో సినిమాను ఏ సంస్థ ఎంతకు కొన్నదో తెలిసేదే కాదు. కానీ, ఇప్పుడు అధికారికంగా ప్రకటించకముందే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు తెలిసిపోతుంది. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఎక్కడ ఏ సంస్థ సినిమాను రిలీజ్ చేస్తుంది అన్నదానిమీద పెద్ద చర్చనే జరుగుతుంది. ఇప్పటికే పుష్ప, దేవర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వందల కోట్లు పెట్టి భారీ బ్యానర్స్ సొంతం చేసుకున్నాయని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా భారీ బ్యానర్.. రికార్డ్ ధరకు సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ AA ఫిల్మ్స్ సొంతం చేసుకుందని సమాచారం. కేవలం నార్త్ ఇండియా వరకే ఈ సినిమా రూ. 76 కోట్లు వసూలు చేసింది. ఇంకా సౌత్ ఇండియా రైట్స్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం నార్త్ వరకే అన్ని కోట్లు అంటే మాటలు కాదు.

- Advertisement -

Also Read: MAD Square: మొన్న మ్యాడ్ మ్యాక్స్ అన్నారు.. ఇప్పుడేమో మ్యాడ్ స్క్వేర్ అంటున్నారేంటి.. ?

పాన్ ఇండియా రేంజ్ లో అది కూడా నార్త్ లో చరణ్ కు ఉన్న మార్కెట్ ఏ రేంజ్ లో ఉన్నది అనేది.. ఈ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ చూస్తూనే తెలుస్తోంది. కేవలం ఒక పోస్టర్ మాత్రమే ఈ సినిమ నుంచి రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు టీజర్ కూడా రిలీజ్ కాలేదు.. ఇంకా టీజర్ కూడా రిలీజ్ అవ్వకముందే ఇలాంటి రికార్డ్ ను ఏ హీరో అందుకోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News