BigTV English

TSPSP Group 1: ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. టీఎస్‌పీఎస్పీ నిర్ణయం

TSPSP Group 1: ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. టీఎస్‌పీఎస్పీ నిర్ణయం

TSPSP group-1 prelims: టీఎస్‌పీఎస్పీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉటుందని టీఎస్‌పీఎస్పీ స్పష్టం చేసింది. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష తేదీలను గతంలో వెల్లడించింన విషయం తెలిసిందే.


జూన్ 9వ తేదీన నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్‌లైన్ లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్పీ తాజాగా ప్రకటించింది. కాగా, మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు ఇదివరకే వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 19న విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రుప్-1 కొత్త నోటిఫికేషన్ ప్రకటించింది. అయితే ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానం ద్వారా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తూలను స్వీకరించింది. గతంలో వయోపరిమితి 44 ఏళ్లు ఉండగా.. తాజా నోటిఫికేషన్లో దాన్ని 46 ఏళ్లకు పెంచింది.


Also Read: యూజీసీ నెట్ పరీక్ష తేదీల్లో మార్పులు.. కారణం ఏంటంటే..?

వివిధ కారణాలతో 2022లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షలో అవకతవకలు జరగాయన్న కారణాలతో 2022 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి ఎటువంటి ఫీజు లేకుండా కొత్త నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్పీ తెలిపింది. కాగా, ఈ గ్రూప్-1 కోసం దాదాపు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Tags

Related News

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

Big Stories

×