Big Stories

Benefits of Blue Tea: ‘బ్లూ టీ’.. ఎప్పుడైనా తాగారా..? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఈ రోజు నుండే తాగటం ప్రారంభిస్తారు!

Blueberry Tea Benefits: సాధారణంగా ప్రతీరోజు టీ తాగే అలవాటు ఉంటుంది చాలా మందికి. తరచూ టీ, కాఫీలు తాగకుండా అస్సలు ఉండలేరు. అదొక రోజువారి అలవాటులో భాగంగా చేరిపోతుంది. అయితే టీలలో మసాలా టీ, అల్లంటీ, మట్కా టీ, గ్రీన్ టీ, హనీ టీ వంటి చాలా రకాల టీలను తాగుతుంటారు. కానీ చాలా మందికి బ్లూటీ గురించి తెలిసి ఉండదు. బ్లూటీలో ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా రకాలు ఉపయోగపడతాయి. వీటిని యాంటీ ఆక్సిడెంట్లు అని కూడా అంటారు. ఇవి అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా తోడ్పడుతాయి. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

కోన్ ఫ్లవర్ పువ్వులతో తయారు చేసే బ్లూటీలో రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించే ఆంథోసైనిన్స్ ఉంటాయి. బ్లూటీని తరచూ తాగడం వల్ల కొలస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు కూడా తోడ్పడుతుంది. మరోవైపు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే పలు అధ్యయనాల ప్రకారం, బ్లూటీ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్‌లను విచ్చిన్నం చేసే జీర్ణ ఎంజైమ్‌లను నిరోధిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకత, రక్తంలోని చక్కెర స్థాయిలు, గుండె, మొదడు వంటి వాటి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.

- Advertisement -

Also Read: Coconut Water Side Effects : కొబ్బరి నీళ్లు మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..?

యాంటీ డయాబెటిక్, బాక్టీరియల్ వంటి ప్రభావాలను కూడా ఇది తగ్గిస్తుంది. మరోవైపు క్యాన్సర్ వంటి కెంప్పెరోత్ లో సహా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. బ్లూటీని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడిన క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందట. అయితే కోన్ ఫ్లవర్ పువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని మంటను తగ్గిస్తుంది. ఈ టీలో ఎటువంటి హెర్బల్, కెఫిన్ వంటివి ఉండవు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం బ్లూటీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో స్ట్రెస్ గుణాలు ఉంటాయి. అందువల్ల మానసికంగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వారికి ఇది బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News