Indrakaran Reddy resigned from BRS: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌కు షాకులపై షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా అందులో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరారు. ఆయన గులాబీ పార్టీకి, బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి.. రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరారు.
గులాబీ దళానికి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం గాంధీభవన్ కు చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డికి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి#BRSparty #IndrakaranReddy #LokasabhaElection2024 #congressparty #telanganapolitics #bigtvlive@INCTelangana @BRSparty pic.twitter.com/11CbjnSR4O
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2024
BRS కు రాజీనామా
కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి?బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపిన ఇంద్రకరణ్ రెడ్డి#BRSparty #IndrakaranReddy #LokasabhaElection2024 #congressparty#telanganapolitics #bigtvlive@INCTelangana @BRSparty pic.twitter.com/nuQTam5I7s
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2024