Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఏపీ ఎలక్షన్స్ లో జనసేన మంచి హీట్ పుట్టిస్తోంది. వరుస ప్రచారాలతో పవన్ కళ్యాణ్ బిజీగా మారాడు. ఒకప్పుడు సాఫ్ట్ గా ఉండే పవన్.. ఉన్నకొద్దీ రాజకీయాల్లో రాటు తేలాడు. ఆయన ప్రసంగాల్లో కొన్ని తప్పులు దొర్లినా వాటిని పట్టించుకోకుండా ఆ స్వాగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు.
జగన్ పై విమర్శలు గుప్పించడం, ఆయనను టీజ్ చేయడం.. ప్రచారంలో ఫ్యాన్స్ లో జోష్ నింపడానికి డ్యాన్స్ లు వేయడం.. ఇలా పవన్ వైఖరి పూర్తిగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. నేషనల్ వైడ్ గా పవన్ కు క్రేజ్ ఉంది. తాజాగా ఒక నేషనల్ ఛానెల్ కు పవన్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ ర్యాపిడ్ ఫైర్ ఆడాడు. తనకు నచ్చిన పొలిటీషియన్, హీరో ఎవరు అనేది చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి పవన్ ఫేవరేట్ హీరో చిరంజీవి అని అందరికి తెలుసు. అయితే చిరు కన్నా పవన్ కు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. సైరా నరసింహారెడ్డి సినిమా సమయంలో పవన్, అమితాబ్ ను కలిశాడు. అప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు.
ఇక రాజకీయాల్లో మీ మోడల్ ఎవరు అంటే.. నానాభోయ్ నాని అర్దేషిర్ పాల్ఖివాలా.. జయప్రకాశ్ నారాయణ్ అని చెప్పుకొచ్చాడు. అయితే నందమూరి తారకరామారావు ఇష్టం లేదా అంటే.. ఆయన అంటే తనకెంతో గౌరవమని, రెండు తెలుగురాష్ట్రాలు ఆయను గౌరవిస్తాయని చెప్పాడు. ఇక ఈ సమయంలో మీరుఒక సినిమా చూడాలంటే ఏది చూస్తారు అంటే.. హర్రర్ సినిమా చూస్తాను అని, అవి నా మైండ్ ను కొంచెం కామ్ చేస్తాయని తెలిపాడు.
ఇక అంతేకాకుండా బయట దెయ్యాలను చూసి భయపడకుండా ముందు ఈ దెయ్యాలతో ప్రాక్టీస్ చేస్తానని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక పవన్ సినిమాలా విషయానికొస్తే ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అన్ని సగం సగం షూటింగ్స్ పూర్తిచేసుకొని.. పవన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఎలక్షన్స్ అవ్వగానే పవన్ మళ్లీ షూటింగ్స్ లో పాల్గొననున్నాడు.
Actor-turned-politician @PawanKalyan reveals unknown facts about himself in this rapid fire round with @SardesaiRajdeep. Watch!#PawanKalyan #RajdeepSardesai #ElectionsOnMyPlate #LokSabhaElections2024 #EOMP pic.twitter.com/K3nQeKOmtC
— IndiaToday (@IndiaToday) May 1, 2024