PM Modi: కాంగ్రెస్ మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించబోమని ప్రకటించగలదా అని ప్రధాని మోదీ సవాల్ విసిరారు. రాజ్యాంగంతో చెలగాటం ఆడమని ఆ పార్టీ యువరాజు ప్రకటిస్తారా అని అన్నారు. బుధవారం గుజరాత్ లోని బనస్ కంత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు.
బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను కాపాడుతామని తెలిపారు. ఓబీసీలను కాంగ్రెస్ అవమానిస్తోందని అన్నారు. తాము రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని తెలిపారు. తమకు పార్లమెంట్ లో ఇప్పటికే 360 సీట్లు ఉన్నాయని గుర్తు చేశారు.
Also Read:మోదీ పని నచ్చింది, అందుకే చేరానన్న రూపాలీ
బీజేడీ వంటి పార్టీలు కూటమిలో లేకున్నా..తమకు మద్దతుగా నిలిచాయని అన్నారు. వాటన్నింటిని కలుపుకుంటే తమకు 400 స్థానాల బలం ఉంటుందని తెలిపారు. అయినప్పటికీ తాము రాజర్వేషన్లను తొలగించే ఆలోచన చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రదాడులు, స్కామ్ లు, అవినీతి గురించి కథనాలు వచ్చేవని ఆరోపించారు.