BigTV English

NASA: చంద్రుడిపై చైనా ముందు కాలుమోపితే ఇక అంతే సంగతులు.. నాసా చీఫ్

NASA: చంద్రుడిపై చైనా ముందు కాలుమోపితే ఇక అంతే సంగతులు.. నాసా చీఫ్

NASA Chief Bill Nelson: చైనా అంతరిక్ష కార్యకలాపాలపై నాసా అధిపతి బిల్ నెల్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతకొన్నేళ్లు చైనా తాము చేపడుతున్న అంతరిక్ష కార్యకలాపాలను రహస్యంగా ఉంచుతోందని ఆయన ఆరోపించారు. అక్కడ తమ సైన్యం చేస్తున్న ఆపరేషన్లు బయటకు వెళ్లడించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


దశాబ్దాలకాలం నుంచి చైనా అంతరిక్ష రంగంలో ఎంతో ప్రగతిని సాధించిందని నాసా చీఫ్ బిల్ నెల్సన్ తెలిపారు. కానీ డ్రాగన్ తాము సాధించిన ప్రగతిని అంతా ఎంతో రహస్యంగా దాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటవీల కాలంలో చైనా పౌర కార్యక్రమాల పేరిటి.. గగనతలంలో మిలటరీ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు.

nasa chief bill nelson
nasa chief bill nelson

ప్రస్తుతం చైనా బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా ఈ రంగానికి కేటాయిస్తుందని అమెరికా చట్టసభ్యులను ఆయన వెల్లడించారు. ఈ విషయంలో చంద్రుడిపైకి వెళ్లడం అమెరికాపై ఉన్న బాధ్యత అని గుర్తు చేశారు. అయితే అమెరికాకంటే చైనా ముందుగా అక్కడికి వెళ్తే.. ఇది మా ప్రదేశం అంటూ.. వేరే వాళ్లకి స్థానం లేదనే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.


Also Read: ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం.. పొంచి ఉన్న సునామీ ?

2025 ఏడాదికి గాను నాసా బడ్జెట్ కేటాయింపుల అంశంలో భాగంగా అమెరికా ప్రతినిధుల సభకు ఆయన హాజరై.. చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవలే నాసా చంద్రుడిపై శాశ్వత నివాసం ఏర్పాటు కొరకు ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. రానున్న రోజుల్లో కూడా మరిన్ని ప్రాజెక్ట్ లను నాసా చేపట్టనుంది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×