Vistara flight emergency landing(Latest telugu news): విస్తారా ఎయిర్ లైన్స్ విమానం వడగళ్ల వానకు దెబ్బతింది.ఫ్లైట్ విండ్ షీల్డ్ కు పగుళ్లు రావడంతో అప్రమత్తమైన ఫైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బుధవారం మధ్యాహ్నం భువనేశ్వర్ నుంచి ఢిల్లీ బయలు దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన పది నిమిషాలకే తిరిగి ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మధ్యాహ్నం భువనేశ్వర్ తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వడగళ్ల వర్షం కురిసింది. దీంతో టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ విండ్ షీల్డ్ కు పగుళ్లు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఫైలట్ విమానాన్ని తిరిగి ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు.
Also Read:సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. కస్టడీలో ఉన్న నిందితుడు సూసైడ్
ఈ సంఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు స్పందించారు. వడగళ్ల వాన కారణంగా విమానం దెబ్బతిన్నదని తెలిపారు.ఫ్లైట్ విండ్ షీల్డ్ కు పగుళ్లు రావడం వల్లే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు వెల్లడించారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు