Viral Video: జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని అంటుంటారు పెద్దలు. ఒక్కొక్కరి రుచులూ ఒక్కోలా ఉంటాయి. అలాగే అందరి ఆలోచనా విధానం కూడా ఒకేలా ఉండదు. కొందరికి మాత్రం వింత వింత ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు రావడమే తరువాయి ఆచరణలో పెట్టేస్తారు. అయితే ఎండ వేడిమిని తట్టుకోడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసిన వినూత్న ఆలోచన పలువురిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. వీడియోలో ఓ వ్యక్తి ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్న ఆలోచన చేశాడు. ఇంట్లో ఉన్న పాత కూలర్ ను తీసుకుని ఫ్రిడ్జ్ డోర్ తెలిచి..దాని ముందు కూలర్ ఉంచాడు. దీంతో ఫ్రిడ్జ్ నుంచి వచ్చే చల్లటి గాలి కూలర్ ఫ్యాన్ నుంచి బయటకు వస్తోంది. ఇంకేముంది చల్లటి గాలి ముందు అతడు రెస్ట్ తీసుకున్నాడు.
Also Read:చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. వీడియో వైరల్
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు ఆ వ్యక్తి క్రియేటివిటీకి ఆశ్చర్యపోతున్నారు.
How to use your refrigerator as air conditio pic.twitter.com/QAW8QWLWmx
— Eminent Woke (@WokePandemic) April 30, 2024