BigTV English
Advertisement

RGV: చనిపోయిన శ్రీదేవితో ఏంటా పనులు వర్మ.. ?

RGV: చనిపోయిన శ్రీదేవితో ఏంటా పనులు వర్మ.. ?

RGV: రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదం ఎక్కడ ఉంటే వర్మ అక్కడ ఉంటాడు అనడం కన్నా.. వివాదాన్ని కావాలనే కొనితెచ్చుకొనే వర్మ అని చెప్పడం బెస్ట్. ఒకప్పుడు ఎంత మంచి సినిమాలు తీసి ప్రశంసలు అందుకున్నాడో.. ఇప్పుడు చెత్త చెత్త సినిమాలు తీసి విమర్శలు అందుకుంటున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెల్సిందే. ఇష్టం అని చెప్పడం కన్నా ఆమెకు వర్మ భక్తుడు అని చెప్పొచ్చు. ఆమె అందానికి వర్మ బానిస. ఈ విషయాన్ని ఆర్జీవీ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు కూడా.


వర్మ దర్శకత్వంలో శ్రీదేవి రెండు సినిమాల్లో నటించింది. గోవిందా గోవిందా, క్షణ క్షణం. రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 2018 లో శ్రీదేవి మరణించింది. ఆరోజు ఎంతమంది ఎలా ఏడ్చారో తెలియదు కానీ, వర్మ మాత్రం పిచ్చివాడైపోయినట్లు తెలిపాడు. ఆమె స్వర్గంలో రంభ ఊర్వశి మేనక పక్కన ఉండి ఉంటుందని, మళ్లీ భూమిపైకి రావాలని మందుకొడుతూ ఎన్నో ట్వీట్స్ కూడా చేశాడు. అప్పుడే కాదు సమయం చిక్కినప్పుడల్లా.. వర్మ, శ్రీదేవిని తలుస్తూనే ఉంటాడు.

తాజాగా మరోసారి శ్రీదేవిని తలుచుకున్నాడు. కారులో శ్రీదేవి పక్కన కూర్చొని సిగరెట్ కాలుస్తున్న ఫోటోను వర్మ  షేర్ చేశాడు. అదేంటి.. శ్రీదేవి చనిపోయింది కదా.. ఇప్పుడు ఆమె పక్కన కూర్చోవడం ఏంటి అని అనుకుంటున్నారా.. ? మరి.. పైన ఉన్న శ్రీదేవిని కూడా వర్మ కిందకు దించాడు అంటే పొరపాటే.. ఆయనే స్వర్గానికి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. కారులో పక్కన ఉన్న ఒక అబ్బాయి ఫేస్ కు శ్రీదేవి ముఖాన్ని ఎడిట్ చేసి.. అచ్చు శ్రీదేవి కారు డ్రైవ్ చేస్తున్నట్లు చూపించాడు. సడెన్ గా చూస్తే.. నిజంగా శ్రీదేవినే కారు డ్రైవ్ చేస్తుంది అనుకోకుండా ఉండరు.


ఇక దీనికి ఆమెను చూడడానికి స్వర్గానికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చనిపోయిన శ్రీదేవితో ఏంటా పనులు వర్మ.. ? అని కొందరు.. శ్రీదేవి పక్కన ఇంత గ్లామరస్ గా ఉన్న హీరో ఎవరు అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×