BigTV English

Hair Fall Home Remedies: వీటితో.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై చెప్పేయండి

Hair Fall Home Remedies: వీటితో.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై చెప్పేయండి

Hair Fall Home Remedies: జుట్టు మన అందాన్ని మరింత పెంచుతుంది. ఒత్తుగా, పొడవుగా ఉండే జుట్టు ఎవరి అందాన్నైనా రెట్టింపు చేస్తుంది. కానీ ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం కూడా మన జుట్టును ప్రభావితం చేస్తుంది. అందుకే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.


జుట్టు రాలుతుంటే కనక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతే కాకుండా జుట్టుకు కొన్ని హెయిర్ మాస్క్‌లను అప్లై చేయడం వల్ల జుట్టు బలపడటమే కాకుండా కొత్త జుట్టు వస్తుంది. మరి ఇన్ని లాభాలు ఉన్న హెయిర్ మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలి. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని పదార్థాలతో మీ జుట్టు కోసం అద్భుతమైన హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ మాస్క్‌లు మీ జుట్టుకు పోషణను అందిస్తాయి.అంతే కాకుండా మృదువుగా , మెరిసేలా చేస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.


1.పెరుగు, తేనె జుట్టు హెయిర్ మాస్క్..

కావలసినవి:
పెరుగు- 1/2 కప్పు
తేనె- 2 టీస్పూన్
గుడ్డు – 1 (ఇష్టమైతే)

తయారీ విధానం: పైన చెప్పిన విధంగా పెరుగు, తేనె, ఎగ్ లను తీసుకుని ఒక బౌల్‌లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత మీరు వాడే షాంపూతో తలస్నానం చేయాలి.
ఇందులోని పెరుగు జుట్టుకు తేమను అందిస్తుంది. తేనెలో యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలకుండా చేస్తాయి.అంతే కాకుండా ఎగ్ జుట్టును బలంగా ఉండేలా చేస్తుంది.

2. అవకాడో , కొబ్బరి నూనె హెయిర్ మాస్క్:

కావలసినవి:
అవకాడో (గుజ్జు)- 1/2 టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె- 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదులో మెత్తని అవకాడో పేస్ట్‌లో కొబ్బరి నూనె కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

అవకాడోలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణనిస్తాయి. అంతే కాకుండా ఇందులోని కొబ్బరి నూనె జుట్టును బలపరుస్తుంది.

Also Read:  పండగ సమయంలో మెరిసిపోవాలా ? వీటితో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి

3. గుడ్డు, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్:

కావలసినవి:
గుడ్డు- 1
ఆలివ్ నూనె- 2 టీస్పూన్లు
నిమ్మరసం- 1 టీస్పూన్

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన మోతాదులో అన్ని పదార్థాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇందులో వాడిన గుడ్డు జుట్టుకు ప్రొటీన్‌ను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టుకు తేమను ఇస్తుంది. అంతే కాకుండా నిమ్మరసం జుట్టును మెరిసేలా చేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×