BigTV English

Sandeep Reddy Vanga: స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడే.. ప్లేస్ తోనే అంచనాలు పెంచేశారుగా!

Sandeep Reddy Vanga: స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడే.. ప్లేస్ తోనే అంచనాలు పెంచేశారుగా!

Sandeep Reddy Vanga:టాలీవుడ్ స్టార్ హీరోగా ఒకప్పుడు మంచి పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas).. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే మారుతీ (Maruthi ) దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’, సలార్ కొనసాగింపుగా సలార్ 2, కల్కి 2 చిత్రాలతో పాటు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్ పైకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ తప్ప ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు సెట్ పైకి వెళ్తుంది అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. సడన్ గా ప్లేస్ ఫిక్స్ చేసి.. ప్లేస్ తోనే అంచనాలు పెంచేశారు సందీప్ రెడ్డి వంగ.


స్పిరిట్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అక్కడే..

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. సెప్టెంబర్ నెలాఖరుణ పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ విదేశాలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే మెక్సికో, మలేషియా, ఇండోనేషియా, బ్యాంకాక్ వంటి విదేశాలలో లొకేషన్లు చూసి వచ్చిన ఈయన తన తొలి షెడ్యూల్ తో పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి అయితే తొలి షెడ్యూల్ గురించి చెప్పి సినిమాపై ఊహించని అంచనాలు పెంచేశారు సందీప్..


షూటింగ్ ప్రారంభం అప్పుడే..

ఇక సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం అయినా.. నవంబర్లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నారని సమాచారం. భారీ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు డార్లింగ్ చేసిన సినిమాలలో పోలీస్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ప్రభాస్ లుక్, క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి కూడా అభిమానులలో నెలకొంది.. ఈ సినిమాతో ప్రభాస్ తన అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

స్పిరిట్ మూవీ విశేషాలు..

ఇక సందీప్ రెడ్డివంగా విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈయన యానిమల్ సినిమా చేసి మరో విజయాన్ని అందుకున్నారు.. ఇప్పుడు స్పిరిట్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో బాగానే అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ (Harsha Vardhan Rameswar) ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా పాటలను కంపోజ్ చేయడం కూడా పూర్తయ్యాయని, ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో విలన్ పాత్ర కోసం కొరియర్ నటుడు మా డాంగ్ – సియోక్ ను తీసుకుంటున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డివంగా, భూషణ్ కుమార్ , క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ALSO READ:Vijay Sethupathi: డబ్బుతో అమ్మాయిలను వంచిస్తాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

Related News

Coolie: తెలుగు రాష్ట్రాల్లో రజనీ ర్యాంపేజ్, ఇదయ్యా మీ అసలు స్టామినా

Rajinikanth: బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా?

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్

Anupama: నా సినిమాలలో ఇప్పటివరకు నచ్చని పాత్ర అదే!

Coolie Vs Leo: కూలీ టార్గెట్‌ ‘లియో’.. ఫస్ట్‌ డే ఎంత కొట్టాలంటే..

Big Stories

×