BigTV English
Advertisement

The RajaSaab Motion Poster : మోషన్ పోస్టర్ తో హడలెత్తించిన ప్రభాస్.. అసలైన బర్త్ డే ట్రీట్..!

The RajaSaab Motion Poster : మోషన్ పోస్టర్ తో హడలెత్తించిన ప్రభాస్.. అసలైన బర్త్ డే ట్రీట్..!

ప్రభాస్ బర్త్ డే ట్రీట్…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ (Malavika mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్ (Riddhi Kumar)లు ఇందులో హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోతో మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. ఇకపోతే మొదటిసారి ప్రభాస్ హారర్ సినిమా (Horror Movie) చేస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మోషన్ పోస్టర్ పై కూడా అంచనాలు పెరిగాయి. ఇక మోషన్ పోస్టర్ ( The RajaSaab Motion Poster ) బాగానే ఉన్నా .. అందులో ప్రభాస్ లుక్ తాత లాగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


మోషన్ పోస్టర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్…

మోషన్ పోస్టర్ లో .. అడవిలో పియానో ప్లే అవుతూ ఉండగా ఒక భవంతిలోకి తీసుకెళ్లి.. ప్రభాస్ ముసలి గెటప్ లో చుట్ట కాలుస్తూ.. సింహాసనం మీద కూర్చున్నట్టు చూపించారు. ఈ మోషన్ పోస్టర్ హారర్ మ్యూజిక్ తో చాలా అదరగొట్టేసింది. చివర్లో హారర్ కొత్త రకం కామెడీ అంటూ పోస్ట్ చేయడంతో ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఇలా మొదటి పోస్టర్తోనే నిరాశ మిగిల్చారు అని చెప్పవచ్చు. ఇందులో ప్రభాస్ ను తాత గెటప్ లా చూపించడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఒక వర్గం ప్రేక్షకులకు ఈ లుక్ నచ్చకపోయినా.. మరి కొంతమంది సరికొత్త లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ లుక్ చూసిన తర్వాత ప్రభాస్ తాత , మనవడు గెటప్స్ లో నటిస్తున్నారా? లేదా నాన్న కొడుకు గెటప్స్ లో చేస్తున్నారా ? అన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ మాత్రం ఒక వర్గాన్ని విపరీతంగా మెప్పించింది అని చెప్పవచ్చు.

రాజా సాబ్ తారాగణం…

నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన వచ్చే యేడాది విడుదల చేయబోతున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో నటిస్తూ ఉండగా.. ప్రముఖ బ్యూటీ మాళవిక మోహనన్ తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఇందులో కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు (Yogi babu ), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) కూడా నటిస్తున్నట్లు సమాచారం. దాదాపు రూ .200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇక ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.థమన్ (SS Taman) మ్యూజిక్ అందిస్తూ ఉండగా.. తెలుగు, హిందీ తో పాటు కన్నడ , తమిళ్ , మలయాళం భాషలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పిస్తుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×