Priyanka Tare: నోయిడా వేదికగా అత్యంత ఘనంగా ఎస్ కే మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ 2025లో భాగంగా అందాల పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ పోటీలలో తన అందంతోపాటు ఆత్మస్థైర్యంతో జడ్జిల హృదయాలను దోచుకున్నారు ప్రియాంక తారే (Priyanka thare) .. తెలంగాణ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక తారే ప్రతిష్టాత్మక ఎస్ కే మిస్సెస్ ఇండియా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ 2025 విజేతగా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో పాటు మిస్సెస్ ఇండియా తెలంగాణ 2025, సీజన్ 27 టైటిల్ ని కూడా ఆమె గెల్చుకొని ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు.
అనంతరం నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ఈ విజయ ప్రస్థానంలో పియు ప్రొడక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రతిష్టాత్మక హోదాతో మరింత గౌరవాన్ని అందుకున్నారు. ఆగస్టు 2 2025న నోయిడాలోని వైట్ హౌస్ ప్యాలెస్ లో జరిగిన ఎస్కే యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ 2025, సీజన్ 27 ఈవెంట్ వేదికగా తన సౌందర్యం, సమతుల్యతతో స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని జరుపుకున్నారు.
ప్రియాంక తారే విషయానికి వస్తే.. చత్తీస్ఘడ్ లోని బిలాయ్ కి చెందిన ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకవైపు కార్పొరేట్ లీడర్షిప్ తో ఈవెంట్లు, హెచ్ ఆర్, సి ఎస్ ఆర్ విభాగాలలో రాణించడంతో పాటు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, నృత్యకారిణిగా, గాయనిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచం నుంచి మోడలింగ్లో తన మార్క్ ప్రదర్శనలతో స్వీయ ఆవిష్కరణకు తన వ్యక్తిత్వం, పరివర్తన, ధైర్యం నిదర్శంగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు.
టి ఎస్ ఈ 8 ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు 2025 ను కూడా అందుకుంది. ఇదే కాకుండా ఈమె ఒక ప్రముఖ యూట్యూబర్ గా, ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా, ఐకానిక్ పబ్లిక్ ఫిగర్ గా కూడా పేరు దక్కించుకుంది. అంతేకాదు చాలామందికి రోల్ మోడల్ గా ఉన్న ప్రియాంక మహిళలను శక్తివంతం చేయడంలో, వెనుకబడిన పిల్లలకు ప్రోత్సాహం అందించడంలో ఎప్పుడు ముందుంటుంది. తన ప్రయాణంలో దయ, అందం, దృఢత్వం, అంకితభావంతో అందరి మన్ననలు పొందుతున్న ఈమె ఇటీవల తన ఆలోచనలు, విజయాలు, అంతకుమించిన అందంతో దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తోంది. ఈమె ఘనతలు చూసి పలువురు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ:Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!