BigTV English

Tax Relief: మీ పెంపుడు జంతువులను సింహాలకు ఆహారంగా ఇస్తే.. ట్యాక్స్ నుంచి ఉపశమనం!

Tax Relief: మీ పెంపుడు జంతువులను సింహాలకు ఆహారంగా ఇస్తే.. ట్యాక్స్ నుంచి ఉపశమనం!

Danish Zoo: డెన్మార్క్ లోని ఆల్బోర్గ్ జూ అధికారులు రీసెంట్ గా తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. జూ లోని క్రూర మృగాలకు ప్రజలు తమ దగ్గర ఉన్న పెంపుడు జంతువులను ఆహారంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. కోళ్లు, కుందేళ్ళు, గినియా పందులు సహా పలు రకాల జంతువులను దానం చెయ్యొచ్చని సూచించింది. యజమానులు అవసరం లేని జంతువులను తమకు అప్పగించవచ్చన్నారు అధికారులు. ఈ మేరకు జూ అధికారిక ఇన్‌ స్టాగ్రామ్‌ హ్యాండిల్ లో రిక్వెస్ట్ చేశారు.


జూ అధికారులు ఎందుకు ఈ రిక్వెస్ట్ చేశారంటే?

సాధారణంగా జూలో ఉన్న క్రూర మృగాలకు అధికారులు నేరుగా మాంసాన్ని అందిస్తారు. ఎద్దు, బర్రె లాంటి జంతువుల మాంసాన్ని తెచ్చి పులులు, సింహాలు ఉండే బోనులో వేస్తారు. సదరు జంతువులు ఆ మాంసాన్ని తిని హాయిగా పడుకుంటాయి. అయితే, జూలో ఉన్న జంతువులు తమ సహజ వేటాడే లక్షణాన్ని కోల్పోతాయి. పెట్టింది తిని బద్ధకంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అడవిలో మాదిరిగా వేటాడే లక్షనాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ప్రజల దగ్గర ఉన్న కుందేళ్లు, కోళ్లు, పందులు సహా ఇతర జంతువులను అప్పగిస్తే, వాటిని తీసుకెళ్లి క్రూర మృగాల బోనులో వేస్తారు. అందులో ఉన్న జంతువులు వాటిని వేటాడి పట్టుకుని తినేస్తాయి. దీని వలన ఆ జంతువులు తమ సహజ లక్షణాన్ని కోల్పోకుండా ఉంటాయని భావిస్తున్నారు.


 రీసెంట్ గా పోనీని దానం చేసిన మహిళ

జూ అధికారులు పిలుపుతో రీసెంట్ గా ఓ మహిళ తన కూతురు పెంపుడు పోనీని జూకు దానం చేసింది. ఈ దానంతో జూ అధికారుల కార్యక్రమానికి మరింత ప్రచారం జరిగింది. పోనీ అనారోగ్యానికి గురి కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు మహిళ వెల్లడించింది.

Read Also:  అక్కడ పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.. గుడిసెల్లోకి పంపి మరీ ఎంకరేజ్ చేసే పెద్దలు!

పెట్స్ ను దానం చేస్తే ట్యాక్స్ మినహాయింపు

ఆల్బోర్గ్ జూ సిబ్బంది విజ్ఞప్తి మేరకు ఇప్పటికే 22 గుర్రాలు, 18 గినియా పందులు, 53 కోళ్లు, 137 కుందేళ్ళను ప్రజలు  విరాళంగా ఇచ్చారు. తమకు జంతువులను దానం చేసిన వారికి చిన్న పన్ను మినహాయింపు ఇవ్వడంతో పాటు కొంత మొత్తం డబ్బులను కూడా అందిస్తున్నట్లు జూ అధికారులు తెలిపారు.  దానంగా వచ్చిన జంతువులను ఆల్బోర్గ్ జూలోని యురేషియన్ లింక్స్, సింహాలు, పులులకు ఆహారంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ జంతువులను వేటాడం ద్వారా సదరు క్రూర జంతువులు తమ సహజ గుణాన్ని కోల్పోకుండా ఉంటున్నాయని తెలిపారు. అయితే, జూ అధికారులు విజ్ఞప్తి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదో చెత్త నిర్ణయంగా జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని జూ అధికారులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also:  ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!

Related News

Hydrogen Train: హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఫస్ట్ సర్వీస్ అక్కడే.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి!

Escalators at Mountains: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!

Tirumala rules: తిరుమలకు వచ్చే వాహనాలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 15 నుండి కొత్త రూల్స్!

Free Wi-Fi: రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

Air India Flights: అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Big Stories

×