Weather News: గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షాలు దంచికొడుతున్నాయి. సాయంత్రం, రాత్రివేళల్లో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది.
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వివరించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
FLOODING RAINFALL WARNING ⚠️⛈️
Dear people of Telangana, due to LOW PRESSURE IMPACT, there will be FLOODING RAINS during next 4days ⚠️🌊
August 12-13 – VERY HEAVY FLOODING RAINS expected in South, East Telangana. Flooding rains (150-200mm) rains expected in few places ⚠️… pic.twitter.com/uzA8jzIpTh
— Telangana Weatherman (@balaji25_t) August 12, 2025
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వల్ల మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!
కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
రాబోయే రెండు గంటల్లో జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ టీ. బాలాజీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వివరించారు. అక్కడక్కడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొన్నారు. పశ్చిమ, దక్షణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మూడు గంటల్లో వర్షాలు పడతాయని చెప్పారు.
ALSO READ: EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్
సాయంత్రం వేళ భారీ వర్షాలు
రేపు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్ లో పగటి వేళ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు. ఆగస్ట్ 14, 15 తేదీల్లో పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పారు.